లండన్ నుంచి మహరాష్ట్రకు వర్షాన్ని తీసుకెళ్లమని కోరిన కేదార్ జాదవ్

లండన్ నుంచి మహరాష్ట్రకు వర్షాన్ని తీసుకెళ్లమని కోరిన కేదార్ జాదవ్

క్రికెట్ ప్రపంచంపై వరుణుడు పగబట్టాడా అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే…ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూసే ప్రపంచకప్ టోర్నమెంట్ మొదలైన దగ్గరినుంచి వర్షం దెబ్బకు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆగిపోయాయి. దీంతో మ్యాచ్ మొత్తాన్ని చూడాలని ఆశిచిన ప్రేక్షకులను, ఆటగాళ్ల స్పూర్తిని దగ్గరుండి చూడాలనుకున్న అభిమానులను పూర్తీగా నిరాశ పరుస్తోంది వర్షం. ఇక బుధవారం జగరాగ్ల్సిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దవడంతో అక్కడిదాకా వెళ్లిన ప్రేక్షకులు గొడుగులు పట్టుకుని దీనంగా చూడాల్సి వచ్చింది. ఇక ఆటగాళ్లైతే డ్రెస్సింగ్ రూం బాల్కనీలో కూర్చొని స్నాక్స్ తింటూ వర్షం ఎప్పుడు ఆగుతుందా..ఎప్పుడు మైదానంలోకి అడుగు పెడతామా అని ఎదురుచూశారు. టాస్ వేయడానికి కూడా గ్యాప్ లేకపోవడం, తర్వాత వర్షం ఆగినా మ్యాచ్ ఆడటానికి వీలుగా మైదానం లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేసి ఇరుజట్లకు చెరొక పాయింట్లు ఇచ్చారు.

ఇక్కడిదాకా ఒకెత్తు ఐతే…ఈ వర్షాని అసంతృప్తిగా ఉన్న భారత ఆటగాడు కేదార్ జాదవ్ వరుణిడిని నిందిస్తూ ఒక వీడియో చేయడంతో అది బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో జాదవ్…ఓ వర్షమా! ఈ వానను ఇక్కడి నుంచి మహరాష్ట్రకు తీసుకెళ్లచ్చుగా..అని కోరాడు. ఈ వీడియో కాస్త క్రీడాభిమానులకు నచ్చడంతో బాగా వైరల్ అయింది. దీనికి ప్రధాన కారణం…జాదవ్ సొంత రాష్ట్రం పట్ల చూపించిన ప్రేమను భారత అభిమానులు గుర్తించి ప్రశంసించారు.

కేదార్ జాదవ్‌ సొంత రాష్ట్రం మహారాష్ట్రలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో రోజురోజుకి నీళ్ల సమస్య అధికమవుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంత జనాలు ఎండలతో అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తట్టుకోలేద అక్కడి ప్రజలు కోసం కిలోమీటర్ల మేర నడిచెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా ఉష్ణోగ్రతలు సైతం తీవ్రంగా పడిపోవడంతో జలాశయాల్లోని నీరు పూర్తీగా తగ్గిపోతోంది. ఈ కారణాల వల్లే కేదార్ జాదవ్ లండన్‌లో పడుతున్న నీటిని మహరాష్ట్రకు తీసుకెళ్లమని వరుణుడిని కోరాదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *