కలవరపడ్తున్న తెలంగాణ మంత్రులు..కారణం ఇదేనా?

కలవరపడ్తున్న తెలంగాణ మంత్రులు..కారణం ఇదేనా?

తెలంగాణ మంత్రుల్లో టెన్ష‌న్ మొద‌లైంది.. త‌మ ప‌ద‌వులు ఉంటాయో.. ఊడ‌తాయోన‌న్న ఆందోళ‌న‌లో అమాత్యులున్నారు.. ఎ క్షణాన ఎలాంటి నిర్ణ‌యం వినాల్సి వ‌స్తుందోన‌న్న భయం ఆ మినిష్ఱ‌ర్స్ ను వెంటాడుతోంది..అయితే ఇంత‌కీ ఆ మంత్రులు చేసిన త‌ప్పు ఏంటీ..? ఎందుకు వారు అంత‌లా భ‌య‌ప‌డ‌టానికి కార‌ణాలేంటీ…? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

తెలంగాణ మంత్రుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.. త‌మ ప‌ద‌వుల‌కు ఎప్పుడు ఎర్త్ ప‌డుతుందోన‌న్న భ‌యం వారిని వెంటాడుతోంది.. ఇందుకు కార‌ణాలు లేక‌పోలేదు.. గురువారం వెలువ‌డిన ఎంపి ఎన్నిక‌ల ఫ‌లితాలే మంత్రుల టెన్ష‌న్ కు కార‌ణ‌మంటున్నాయి టీఆర్ఎస్ వ‌ర్గాలు… తెలంగాణ‌లో ఎంఐఎం సీటును మిన‌హాయిస్తే మిగిలిన ప‌దహారు సీట్ల‌ను గెల‌వాల‌ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అంతే కాదు కేసీఆర్తో పాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్త్ర‌త ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.. కొద్ది నెల‌ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.. దీంతో ఎంపి స్థానాల‌న్నీ త‌మ ఖాతాలోకి వ‌స్తాయ‌ని టీఆర్ఎస్ భావించింది. అయితే అనుహ్యాంగా కేవ‌లం తొమ్మిది స్థానాల‌కే గులాబీ పార్టీ ప‌రిమిత‌మైంది.అంతే కాదు ఏకంగా సీఎం కుమార్తె ఎంపి క‌విత ఓట‌మి పాల‌య్యారు. ఊహించ‌ని విధంగా ప్ర‌తిప‌క్షాలు పుంజుకున్నాయి.

దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంత్రుల‌పై చాలా అగ్ర‌హాంగా ఉన్న‌ట్లు స‌మాచారం. గ్రేట‌ర్ కు సంబంధించి మంత్రి త‌ల‌సాని కుమారుడు సాయికిర‌ణ్ కు సికింద్రాబాద్ ఎంపి సీటును టీఆర్ఎస్ కేటాయించింది.. సికింద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి.. అయినా కూడ ఇక్క‌డ కిష‌న్ రెడ్డి గెల‌వ‌డంతో సీఎం న‌గ‌ర నేత‌ల‌పై సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.. దీంతో మంత్రి త‌ల‌సానిలో ఆందోళ‌న మొద‌లైన‌ట్లు అయ‌న సన్నిహితులు చెబుతున్నారు. గ్రేట‌ర్ కు సంబంధించి మ‌రో మంత్రి అయిన మ‌ల్లారెడ్డిలో ఇదే ర‌కం భ‌యం క‌నిపిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌ల్లారెడ్డి అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎంపిగా పోటీ చేసారు.. ఇక్క‌డి నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందారు.. త‌మ కుటుంబానికే చెందిన నేత‌ల‌ను గెలిపించుకోలేక‌పోవ‌డంతో త‌మ మంత్రి ప‌ద‌వులు ఊడిన‌ట్లేనని ఈ అమాత్యులు భావిస్తున్నార‌ట‌.

ఇక న‌ల్గోండ‌కు చెందిన జ‌గ‌దీశ్ రెడ్డిది కూడ ఇదే ప‌రిస్థితి అని పోలిటిక‌ల్ స‌ర్కిల్లో వినిపిస్తోంది.టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన‌ భువ‌న‌గ‌రితో పాటు న‌ల్గోండలో కాంగ్రెస్ పాగా వేసింది. ఇప్ప‌టికే ఇంట‌ర్ బోర్డ్ విష‌యంలో జ‌గ‌దీశ్ రెడ్డిపై సీఎం అగ్రహాంగా ఉన్నారు.. దీనికి తోడు ఈ జిల్లా నుంచి గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మంత్రి ప‌ద‌వి అశిస్తున్నారు.. దీంతో త‌న ప‌ద‌వికి ముప్పు ఉంటుంద‌ని జ‌గ‌దీశ్ రెడ్డి భావిస్తున్న‌ట్లు టీఆర్ఎస్ లో చ‌ర్చ న‌డుస్తోంది. క‌రీంన‌గ‌ర్ కు చెందిన మ‌రో మంత్రి ఈటెల రాజేంద‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మెజారీటీ ఇచ్చిన‌ప్ప‌టికి క‌రీంన‌గ‌ర్ సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజారీటీతో క‌మ‌లనాథులు ద‌క్కించుకున్నారు. దీంతో ఈటెల కూడ త‌న ప‌ద‌విపై భ‌యంగా ఉన్న‌ట్లే స‌మాచారం. అదిలాబాద్ ఎంపి సీటును సైతం బిజెపి గెలుచుకుంది. దీంతో ఈ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిస్థితి ఎంట‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌రంగా మారిందంటున్నాయి తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాలు.

ఇదంతా ఒక ఎత్త‌యితే నిజామాబాద్ సిట్టింగ్ ఎంపి … ముఖ్య‌మంత్రి కుమార్తె క‌విత అనుహ్యాంగా ఓటమి పాల‌య్యారు..కాషాయ పార్టీ అభ్య‌ర్థి చేతిలో క‌విత ఖంగుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *