శ్రీవారి సేవలో కేసీఆర్ ఫ్యామిలీ..

శ్రీవారి సేవలో కేసీఆర్ ఫ్యామిలీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. నైవేద్య విరామ సమయంలో సీఎం కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదిలాఉంటే సీఎంగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కేసీఆర్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో కేసీఆర్‌కు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *