మళ్ళీ బిగ్‌బాస్‌ రచ్చ... బాబూగోగినేనిపై విరుచుకుపడ్డ కౌశల్‌ భార్య

మళ్ళీ బిగ్‌బాస్‌ రచ్చ... బాబూగోగినేనిపై విరుచుకుపడ్డ కౌశల్‌ భార్య

బిగిబాస్‌ 2 తెలుగు సీజన్‌ చాలా వివాదాలకు దారి తీసింది. కౌశల్‌ క్రేజ్‌ను అమాంతంగా పెంచేసింది. అయితే దీనంతటి వెనకా ముందునుంచీ వేసుకున్న ప్లాన్ ఉందని ఎంతో మంది నమ్ముతున్నారు. బిగబాస్‌ షో కంటే ముందుగానే, కౌశల్‌ ఆర్మీ ఏర్పడిందనే వార్తలూ ఉన్నాయి. ఈ వివాదాలు కొన్నాళ్ల నుంచీ పెద్దగా కనిపించలేదు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో శనివారం జరిగిన డిబేట్‌తో ఈ వివాదం మరోసారి తెరమీదకొచ్చింది.

శనివారం ఆస్ట్రేలియాలో…

గత శనివారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో బిగ్‌బాస్‌పై డిబేట్‌ జరిగింది. దీనిలో కౌశల్, ఆయన భార్య నీలిమ, బాబు గోగినేని పాల్గొన్నారు. ఇక్కడ మరోసారి మాటల యుద్ధం జరిగింది. కౌశల్ ఆర్మీ ఫేక్‌ అనీ, డబ్బులిచ్చి నడిపించిందనీ, ఫేస్‌బుక్‌లో ఫేక్‌ ఎకౌంట్లు క్రియేట్ చేసి ముందుకు నడిపించారనీ బాబూ గోగినేని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను కౌశల్‌ భార్య నీలిమ తీవ్రంగా వ్యతిరేకించారు.

Kaushal Army

గోగినేనిపైకి దూసుకెళ్లిన నీలిమ…

ఈ చర్చంతా హాట్‌హాట్‌గానే నడిచింది. బూబూ గోగినేని వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించిన నీలిమ… వాటికి ప్రూఫ్‌లు చూపమని అడిగింది. ఆ విషయాన్ని బాబు దాటవేయడంతో… ‘ఇట్ ఈజ్ ద మ్యాటర్’ అంటూ అతడి మీదకు నీలిమా దూసుకెళ్లింది. బిగ్‌బాస్ షో మొదలవ్వడానికి ముందుగానే ఫేస్‌బుక్‌లో గ్రూపులు స్టార్ట్‌ చేసారన్న గోగినేని వ్యాఖ్యలను కౌశల్‌, నీలిమాలు ఖండించారు. హౌజ్‌లో తనను ఒక్కడినీ చేసి టార్చర్‌ చేయడం వల్లే, ఆ సానుభూతితోనే కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చిందని… భార్యాభర్తలిద్దరూ గట్టిగానే చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *