కతువా కేసులో నేడు తుది తీర్పు

కతువా కేసులో నేడు తుది తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా అత్యాచారం, హత్యకేసులో ఇవాళ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుల ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కోర్టు.. ఇవాళ తుది తీర్ప ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కథువాతోపాటు కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 8 మంది నిందితుల్లో ఏడుగురిపై అత్యాచారం, హత్య అభియోగాలు నమోదయ్యాయి.

గతేడాది జనవరి 10న జమ్ముకశ్మీర్‌లోని కతువాకు చెందిన 8 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. ఆపై చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేశారు. నాలుగు రోజుల తర్వాత బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో గ్రామ పెద్ద సంజీ రామ్, ఆయన కుమారుడు విశాల్, బాలుడైన ఆయన మేనల్లుడు, అతడి స్నేహితుడైన అనంద్ దత్తా, ఇద్దరు స్పెషల్ పోలీసులు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలకమైన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు కీలక నిందితుడైన సంజీరామ్ నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకున్న హెడ్‌కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఎస్ఐ ఆనంద్ దత్తాలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *