కర్ణాటక రాజకీయంలో షాకింగ్ నిర్ణయాలు!

కర్ణాటక రాజకీయంలో షాకింగ్ నిర్ణయాలు!

కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులందరూ రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ శాసనసభా పక్షనేత సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేదని, వారంతా స్వచ్ఛందంగానే మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22మంది మంత్రులు రాజీనామా చేసినట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. రెబల్స్‌కు లైన్ క్లియర్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. జేడీఎస్‌కు చెందిన మంత్రులు కూడా వీరి దారిలోనే నడుస్తారా లేక మంత్రులుగా కొనసాగుతారా అన్నది తెలియాల్సి ఉంది.

మేమే మంత్రిపదవి ఇస్తాం…

ఇక.. ముంబై హోటల్లో సేద తీరుతున్న కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో కొందరికి బీజేపీ ఇప్పటికే మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టడానికి ఆ మంత్రి పదవులేవో తామే ఇస్తామనే సంకేతాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మంత్రులతో రాజీనామా చేయించినట్లు తెలిసింది. అయితే.. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఈ పరిణామాలు ఎటువంటి లాభాల్ని చేకూరుస్తుందో చూడాల్సివుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *