ఓట్ల కోసం నాగిని డ్యాన్స్

ఓట్ల కోసం నాగిని డ్యాన్స్

ఐదేళ్లు కార్లలోనూ, ఫ్లైట్‌లలో తిరిగే రాజకీయ నాయకులు ఎన్నికలు దగ్గరపడితే చాలు రోడ్ల మీద కాలినడకన ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి సిద్ధమైపోతారు. ఈ మధ్యనే టీడీపీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ బట్టలు ఉతికి ఓటర్లను దర్శనం చేసుకున్నారు. ఇపుడు తాజాగా కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజు జనమంతా ఉండగా వారి మధ్యలో నాగిని డ్యాన్స్ చేసి అలరించారు. హోస్పెట్‌లోని కడిగెనహళ్లిలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

కర్ణాటకలోని హోస్పేట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తరపున ప్రచారం నిర్వహించడానికి వెళ్లిన నాగరాజు నాగిని డ్యాన్స్ చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన వీరప్ప మొయిలీ…చిక్‌బళ్లాపూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *