వైజాగ్‌ బీచ్‌లో కరీంనగర్‌ జిల్లా యువకుడి మృతి

వైజాగ్‌ బీచ్‌లో కరీంనగర్‌ జిల్లా యువకుడి మృతి

కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు వైజాగ్ బీచ్‌లో ఈతకు వెళ్లి మృతి చెందాడు. వీణవంక మండలం చల్లూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు స్నేహితులతో కలసి విశాఖ టూర్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం వైజాగ్  బీచ్‌లో ఈత కొడుతూ ఉండగా.. అలలు ఎక్కువ రావడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. హరీష్‌ మరణ వార్త విన్న కుటుంబసభ్యులో శోకసంద్రంలో మునిగిపోయారు.కాగా హరీష్ కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రి ల్యాబ్‌లో టెక్నిషియన్ గా పనిచేస్తున్నట్లగా సమాచారం. ఈ ఘటనపై వైజాగ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *