కరీంనగర్ లో స్టార్ట్ అయిన రూపాయికే అంత్యక్రియలు

కరీంనగర్ లో స్టార్ట్ అయిన రూపాయికే అంత్యక్రియలు

మనిషి బతికినప్పుడు కంటే మరణించినప్పుడు మర్యాదపూర్వకంగా.. గౌరవం తగ్గకుండా అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఏ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. వృద్దాప్య పింఛన్లు అందజేస్తున్న వేళ.. సర్కారోళ్లు ఇచ్చిన మొత్తంలో కొంత మొత్తాన్ని తమ చావు వేళ నిర్వహించాల్సిన అంత్యక్రియల కోసం దాచి పెట్టుకున్న వైనం కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్దృష్టికి వచ్చింది.పెద్ద వయస్కుల నుంచి ఈ మాటవిన్నంతనే ఆయన మనసు వికలమైంది. చావు గురించి బతికినప్పుడే ఆలోచించటం.. తమ అంతిమయాత్ర కోసం డబ్బులు దాచుకోవాల్సిన దుస్థితి ఆయన్ను కదిలించింది. అలా మొదలైన మదనం చివరకు ఒక మంచి పథకానికి కారణంగా మారింది. ఎవరైనా మరణించినప్పుడు వారి అంతిమ యాత్ర కోసం కేవలం రూపాయికి మాత్రమే నిర్వహించేలా కొత్త రూల్ ను తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమాన్ని ఇవాళ కరీంనగర్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభించారు. స్థానికంగా భవానీ నగర్ లోని సాధారణ మరణం పొందిన మంచాల లలిత అంతిమయాత్రలో పాల్గొన్నారు మేయర్ రవీందర్ సింగ్. ఆయనే స్వయంగా పాడె మోసి.. అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా అమలు చేసినా తప్పు కాదు. రానున్న రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య అంతకంతకూ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రూపాయికే అంత్యక్రియల పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *