బన్నీ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్!

బన్నీ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్!

కొత్త హీరోయిన్స్ వస్తే పాత హీరోయిన్స్‌ని పక్కన పెట్టేస్తాడరు దర్శకనిర్మాతలు. కానీ సీనియర్ బ్యూటీ మాత్రం తనని మార్చిపోకుండా చేస్తుంది. అవకాశాలు లేకపోతే ఐటమ్ సాంగ్స్ కూడా ఓకే అంటుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందని సమాచారం. మరి ఏ హీరో సినిమాలో కాజల్ ఐటమ్ సాంగ్ చేయబోతుందో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ….

కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మల్లి ఫామ్ లోకొచ్చేసింది అనుకుంటే.. రీసెంట్ గా వచ్చిన సీత సినిమా కాజల్ ఆశల మీద నీళ్లు చల్లింది. అయినా తమిళంలో రెండు సినిమాల్తో పాటుగా.. తెలుగులో శర్వానంద్ తో కాజల్ అగర్వాల్ ఒక సినిమాలో నటిస్తుంది. అయితే కాజల్ కి హీరోయిన్ గానే కాదు.. ఐటెం సాంగ్స్ లోను మంచి పేరుంది. ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ లో నేను పక్కా లోకల్ అంటూ చిందులేసి మెప్పించింది. ఆ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపింది. మరి అడిగినంత ఇస్తే ఐటెం అయితే ఏమైంది అనేలా కాజల్ ఆ సాంగ్ కి స్టెప్పులేసింది.

తాజాగా మరో స్టార్ సినిమాలో కాజల్ ఐటెం సొగ్ చెయ్యబోతుందనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఐటెమ్ సాంగ్ చయబోతుందట. జనత గ్యారేజ్‌లో ఎన్టీఆర్ తో కలిసి పక్కా లోకల్ అంటూ కత్తిలాంటి స్టెప్స్ తో చంపేసిన కాజల్.. ఇప్పుడు మరో సూపర్ డాన్సర్ బన్నీ తో కలిసి ఎలాంటి స్టెప్స్ తో ఇరగదీస్తుందో చూడాలంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *