బాలయ్యతో నటించబోతున్న బ్యూటీ

బాలయ్యతో నటించబోతున్న బ్యూటీ

చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది సీనియర్ బ్యూటీ కాజల్. ఈ సినిమాల తరువాత ఈ బ్యూటీ నటించిన సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. కానీ యంగ్ హీరోలు మాత్రం ఈ భామతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో సినీయర్ హీరోలతో నటించేందుకు ఒకే అంటుంది కాజల్.. మరో పక్క నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న కాజల్ ఇప్పుడు మరో సినీయర్‌తో ఆడిపాడేందుకు సై అంటుంది.

బాలకృష్ణ ,కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో కొత్త మూవీ చేయబోతున్నారు. రూలర్ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ నెల 17న లాంచనంగా ప్రారంభం కానుంది.సినిమాని త్వరగా కంప్లీట్ చేసిన సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..అయితే ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంచబోతుందని తెలుస్తోంది..రెండవ హీరోయిన్ గా హరిప్రియను ఇప్పటికే సెలెక్ట్ చేశారు.ఖైదీ నెంబర్ 150లో అమ్మడు, కుమ్ముడు అంటూ చిరుతో స్టెప్పులేసిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు బాలయ్యతో ఏ రేంజిలో రెచ్చిపోతుందో చూడాలి మరి…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *