లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కియారా అద్వాణీ

లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కియారా అద్వాణీ

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంటుంది కియారా అద్వాణీ. తెలుగులో కూడా స్టార్టింగ్‌లోనే స్టార్ హీరోలతో నటించి తెలుగు ఆడయన్స్‌కు కూడా తగ్గరైయింది. అయితే ఈ బ్యూటీ కాన్సట్రెషన్ మాత్రం బాలీవుడ్‌పైనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌తో కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్‌కు జోడీ కట్టింది.. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే వరసగా క్రేజీ ఛాన్స్‌లు అందుకుంది. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. లేడి ఓరియేంటెడ్ కన్సెప్ట్‌తో కంప్లీట్‌గా కమెడి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యూత్‌కు ఉపయోగపడే మేసేజ్ కూడా ఉంటుందట. సోషల్‌మీడియా వినియోగంలో నేటి యువత పోకడల్ని ప్రతిబింబిస్తు మూవీ ఉండబోతుందని తెలుస్తోంది.. డేటింగ్ యాప్స్ ద్వారా అబ్బాయిల్ని పరిచయం చేసుకొని వారిని ఓ ఆట ఆడుకునే చలాకీ యువతిగా కియారా అద్వాణీ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందట. ఆన్‌లైన్ డేటింగ్ గురించి చర్చించే న్యూఏజ్ సినిమా అని తెలుస్తోంది.. ప్రస్తుతం బాలీవుడ్‌లో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది కియారా.ఈ సినిమాలన్ని హిట్ అయితే మాత్రం బాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌కు వెళ్లడం ఖాయం అంటున్నారు..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *