హాఫ్ సెంచరీ చేసిన కేఏ పాల్

హాఫ్ సెంచరీ చేసిన కేఏ పాల్

ఏపీ ఎన్నికల్లో ఎన్నికల షెడ్యూల్ మొదలైన దగ్గరి నుంచి ఫన్‌‌ని కావాల్సిన అందించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పొలిటికల్ రీ ఎంట్రీ మొదలు.. నామినేషన్లు.. పార్టీ గుర్తు.. ప్రచారం ఇలా ప్రతి అంశంలోనూ కేఏ పాల్ తనదైన మార్క్ చూపిస్తూ వినూత్న ప్రచారం చేశారు. తన ధోరణి వల్ల ఆయనకు ఓట్లు పడే విషయం పక్కనపెట్టి.. పొలిటికల్ జోకర్ అనే ముద్రను వేసుకున్నారు.

అన్ని పార్టీలను భూస్థాపితం చేసి… తాము అధికారంలోకి వస్తామని 150పైగా సీట్లు గెలుస్తున్నానని.. ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా చేస్తున్నాను.. నేనే సీఎం లాంటి అనూహ్యమైన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యారు కేఏ పాల్. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో కీలకమైన నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా కేఏ పాల్ నిలబడ్డారు. అదే నియోజక వర్గం జనసేన నుండి పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు, వైసీపీ నుండి రాఘరామక్రిష్ణంరాజులు పోటీలో ఉండగా.. టీడీపీ నుండి వేటుకూరి శివరామరాజు ఉన్నారు. వీరితో పాటు.. భాజపా అభ్యర్థిగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజుల పోటీలో ఉన్నారు.

ఇప్పటివరకున్న ఫలితాల ప్రకారం కేఏ పాల్‌కి వచ్చింది కేవలం 56 ఓట్లు. కనీసం మెజారిటీ స్థాయి ఓట్లు కూడా సాధించలేకపోవడమంటే ప్రజల్లో కేఏ పాల్‌పై నమ్మకం కాకపోయినా కనీస గుర్తింపు కూడా లేకపోవడం విశేషం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *