జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూత

జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూత

అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, న్యాయవాదులుగా రాణిస్తుండగా, మరొకరు ఇంజనీర్ గా ఉన్నారు.
సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌ లో ఉన్న ఆయన నివాసానికి తరలించగా, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *