ఇక పై ఆ బాధ్యతలు నావే అన్న తారక్

ఇక పై ఆ బాధ్యతలు నావే అన్న తారక్

విశ్వవిఖ్యనేత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఆయన వారసుడు తారక్… ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఇచ్చిన ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది… టీడీపీ అభిమానులకి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కొత్త ఎనర్జీ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటో మీరూ చూడండి.

నాలుగు దశాబ్దాల అలుపెరగని సినీ ప్రస్థానం… 95 మంది దర్శకులతో 302సినిమాలు చేసిన ఘనత, అందులో 365 రోజులు ఆడిన చిత్రాలు 23, 300 రోజులు ఆడిన చిత్రాలు 94, 175 రోజులు ఆడిన సినిమాలు 185, రిపీట్ రన్ లో కూడా వంద రోజులు ఆడిన సినిమాలు 28… మొత్తంగా 302లో 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు, 32 సార్లు ద్విపాత్రాభినయం, 18 సినిమాలకు దర్శకత్వం వహిస్తూ నటించిన కీర్తి…. ఇలా చెప్పుకుంటూ ప్రపంచ సినీ చరిత్రలో ఒక్కరికీ గతంలో కాని భవిషత్తులో కానీ సాధ్యం కాదని పించే రికార్డులు ఒక్క పేరుకే సొంతం, ఒక్కడికే అంకితం.. అతడే ‘ఎన్టీఆర్’. సినీ కళామ తల్లికే ఒక బిడ్డ ఉంటే అతని పేరు ఎన్టీఆర్ అయి ఉంటుంది… విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా, ప్రపంచవ్యాప్త సినీ అభిమానులందరితో అన్న అని పిలిపించుకునే అదృష్టం దక్కించుకున్న ఆ తారకమ్మ సమేత నందమూరి తారక రాముడు, ఆ తర్వాత సినీ ప్రస్థానం నుంచి రాజకీయాల వైపు అడుగేశాడు… శ్రమజీవుల పార్టీ అంటూ, తెలుగు వాడి… వాడీ, వేడిని ఉత్తరభారతానికి చూపించడానికి, తెలుగు దేశం పార్టీ పెట్టి… కేవలం ఎనిమిది నెలల్లోనే దేశం మొత్తం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వైపు తిరిగి చూసేలా, కాంగ్రెస్ కంచుకోటకి బీటలు వారెలా చేసి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన ఘనత సాధించాడు. టీడీపీ పార్టీ జండాని దేశం నడిబొడ్డున నాటాడు.

అయితే ఇదంతా గతం, 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతాల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది… చరిత్రలో పార్టీ ఇప్పటి వరకూ చూడని చావు దెబ్బ తినింది. ముఖ్యంగా తెలంగాణలో పార్టీని పట్టించుకునే నాయకులే కాదు ఎన్టీఆర్ జయంతి నాడు, ఆయన సమాధి దగ్గర కాసిన్ని పూలు పెట్టే మనుషులు కూడా లేకపోవడం విచారం… ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకోని బ్రతికే వారసులు ఉన్నారు, ఆ ఫోటో పెట్టుకొని ఓట్లు అడుక్కునే నాయకులూ ఉన్నారు కానీ ఎన్టీఆర్ ఘాట్ ని పట్టించుకునే మనుషులు మాత్రం కనిపించట్లేదు… ఈ విషయాలు తెలియక, తాత జయంతి నాడు, సమాధి దగ్గర దండం పెట్టుకోని, పెద్దాయన ఆశీర్వాదం తీసుకుందామని వెళ్లిన నేటి తారక రాముడికి, తాతా సమాధి దగ్గర ఒక్క పువ్వు పెట్టే మనిషి కూడా లేడా అనిపించిందేమో కానీ హుటాహుటిన కావాల్సినన్ని పూలు తెచ్చి, తానే స్వయంగా తాత సమాధి పైన చల్లి, ఇక పై ఎన్టీఆర్ ఘాట్ ని చూసుకునే బాధ్యత నాదే అని అందరికీ వినిపించేలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ మాటలు విన్న వాళ్లు చాలా ఖుషిగా ఉన్నారు, ఎందుకంటే తాత సమాధి బాధ్యతలు తీసుకున్నట్లే, ఏ రోజుకైనా తాత పెట్టిన పార్టీ పరిస్థితి చూసి చలించిపోయి దాని బాధ్యతలు కూడా తీసుకోకుండా పోతాడా అని… ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న తారక్ పైన ఉన్న టీడీపీ బాధ్యత చాలా బరువైనది.. మరి ఈ బాధ్యతో మోయడానికి ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడో చూడాలి.ఏది ఏమైనా ఎన్టీఆర్ జయంతి నాడు, ఈ మనుషులు ఆ తారక రాముడికి పట్టించిన దుస్థితి చూసిన వాళ్లు మాత్రం… నీ కుటుంబ సభ్యులు, నీ అనుచరులు నిన్ను మర్చిపోవచ్చు, ఒంటరిని చేయొచ్చేమో కానీ… తెలుగు వాడి గొప్పదనాన్ని దశ దిశలు వ్యాపించేలా చేసిన అన్నా… చరిత మరువదు నీ ఘనత అంటున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *