జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానున్నారా?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానున్నారా?

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది… ఇక టీడీపీ పని అయిపోయిందని, ఇక కోలుకోవడం కష్టమేనని అందరూ అనుకుంటున్నారు. ఆ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీకి చంద్రబాబు చరమగీతం పాడాడు, ఇక టీడీపీని బ్రతికించుకోవాలంటే ఆ ఎన్టీఆర్ మనవడు… నేటి జూనియర్ ఎన్టీఆర్ వళ్ళ మాత్రమే అవుతుందని చాలా మంది అంటున్న మాట. అయితే ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తిరిగి ఇప్పట్లో టీడీపీ వైపు వస్తాడా అంటే కష్టమనే చెప్పాలి. నిజానికి ఎన్టీఆర్ గతంలో, అంటే నారా… నందమూరి కుటుంబాల మధ్య శతసంబంధాలు ఉన్నప్పుడు 2009లో టీడీపీ స్టార్ కాంపైనర్ గా పని చేశాడు. ప్రజలకి, ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని కాపాడగలడు అనే నమ్మకం కలిగించిన సమయం అది… ఎన్టీఆర్ చేసిన ప్రచారం, మాట్లాడే విధానం చుసిన రాజకీయ పండితులు కూడా ఆశ్చర్యపోయారు. సుడిగాలి ప్రచారం చేసిన ఎన్టీఆర్, చాలా చోట్ల టీడీపీని బ్రతికించుకున్నాడు కానీ అది అప్పటి మాట…ఎన్టీఆర్ ని వాడుకొని చంద్రబాబు, బాలయ్య పక్కన పెట్టారు. అది అక్షర సత్యం, ఎన్టీఆర్ ని నారా నందమూరి కుటుంబం వాడుకోని వదిలేశారు అనే ఫీలింగ్ లో తారక్ అభిమానులు కూడా ఉన్నారు. అందుకే రాజకీయాలకి పూర్తిగా దూరమైన ఎన్టీఆర్, సినిమాలకి అంకితమయ్యాడు. తన పని తాను చేసుకుంటూ పోయిన ఎన్టీఆర్, ఇప్పుడు బాలకృష్ణతో కలిశాడు కానీ టీడీపీ ప్రచారానికి మాత్రం రాలేదు. ఇప్పుడు టీడీపీ ఓడిపోయింది, బాబు ఇక పార్టీని నడిపించలేడు, టీడీపీ బ్రతకాలి అంటే ఎన్టీఆర్ రావాల్సిందేనని అతని అభిమానులు కోరుకుంటున్నారు…. కానీ ఎన్టీఆర్ నిజమైన అభిమానులెవరూ, విషయాలన్నీ ఆలోచించిన వాళ్ళెవరూ… తారక్ ని రాజకీయాల్లోకి రాకూడదు అనుకుంటున్నారు… తాత కోసం, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ఆ తారక రాముడి మనవడిగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, పవన్ కళ్యాణ్ కి పట్టిన గతే పడుతుందని మరో వాదన కూడా ఉంది కానీ…

పవన్ పరిస్థితి ఎన్టీఆర్ కి ఎప్పటికీ రాదు, ఎందుకంటే పట్టుమని పాతికేళ్ళు కూడా వయసు కూడా లేని టైములో ఎన్టీఆర్ రాజకీయాలని దున్నేశాడు, తన వాక్ చాతుర్యంతో అందరినీ మెప్పించాడు. పైగా అన్నింటికన్నా ముఖ్యమైనది పవన్ లా, ఎన్టీఆర్ ఆవేశపరుడు కాదు ఆలోచనాపరుడు… ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఇదే అతన్ని సక్సస్ఫుల్ పొలిటీషియన్ ని చేస్తుంది… ఈ నమ్మకంతోనే టీడీపీని బ్రతికించడానికి ఎన్టీఆర్ వస్తాడనే ఆశతో, నందమూరి అభిమానులు, తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. మరి వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఎన్టీఆర్, రాజకీయాల్లోకి రావడానికి ఎంత టైం తీసుకుంటాడో చూడాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *