అరవింద సమేత జ్యూక్ బాక్స్ రిలీజ్

అరవింద సమేత జ్యూక్ బాక్స్ రిలీజ్

మోస్ట్ అవైటింగ్ అరవింద సమేత జ్యూక్ బాక్స్ రిలీజ్ అయ్యింది. ముందే అనగనగా, పెనీవిటి విడుదల చేయగా సినిమాలోని మిగిలిన రెండు పాటలని కూడా రిలీజ్ చేశారు.

నాలుగు పాటలతో అరవింద సమేత ఆల్బమ్

ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది ఏడ పోయినాడో పాట గురించి, సీమ కక్షలకి, ఫ్యాక్షనిజంకి ఎప్పటికీ ఎవరూ గెలవరు, దానివల్ల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పిన పాట ఈ ఏడ పోయినాడో ముఖ్యంగా సాంగ్ లో ఉన్న కత్తి కొనన ఎండిన నెత్తుటి మరకని కడిగే దెవరు, ఏకోనలో కూలినాడో అనే లిరిక్స్ సినిమాలో హింస వల్ల నష్టపోయిన వారి గురించి చెప్తుంది. సిట్యుయేషనల్ సాంగ్ గా వచ్చిన ఈ పాటకి టీజర్ కి లింక్ ఉంది. టీజర్ లోని ఫస్ట్ షాట్ లో ఎన్టీఆర్ కట్టిపట్టుకొని అరటి చెట్టుని నరుకుతాడు. ఏడ పోయినాడో సాంగ్ అదే సిట్యుయేషన్ లో రాబోతుందని తెలుస్తుంది, ఇంకా చెప్పాలి అంటే నాగబాబు చనిపోయిన సందర్భంలో వచ్చేలా ఉంది. ఈ సాంగ్ తర్వాతే ఎన్టీఆర్ సీమని, పట్టిన కత్తిని వదిలి బయటకి వస్తాడేమో.

బద్దలైంది….

ఇక జ్యూక్ బాక్స్ లోని చివరిపాట రెడ్డి ఇక్కడ చూడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మాస్ మసాలా సాంగ్ ఇది. పూజ హెగ్డే, ఎన్టీఆర్ మధ్య రానున్న ఈ హై వోల్టేజ్ సాంగ్ థియేటర్స్ లో అభిమానులతో ఈలలు వేయించేలా ఉంది. అరవింద సమేతలోని మిగిలిన మూడో పాటలు సిట్యుయేషనల్ బేస్డ్ కాబట్టి. రెడ్డి ఇక్కడ చూడు సాంగ్ నెంబర్ గా నిలిచింది. మొత్తానికి అరవింద సమేత సినిమాలోని ప్రతి పాట కథ నుంచి పుట్టాయి. థమన్ అన్ని సాంగ్స్ డిఫరెంట్ గా ఇచ్చి కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *