ఆన్‌లైన్ బిచ్చగాడు...లక్షల్లో సంపాదన!

ఆన్‌లైన్ బిచ్చగాడు...లక్షల్లో సంపాదన!

అతని పేరు జోవాన్ హి. న్యూయార్క్‌‌లోని బ్రూక్లైన్‌లో నివసిస్తుంటాడు.  జోవాన్‌కి ఉద్యోగం చేయడం నచ్చలేదు. రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఏదీ ఇష్టంగా అనిపించలేదు.  ఆలోచించాడు. ఎన్నాళ్లు చేసినా ఇదే వ్యవహారం ఉంటుంది. నచ్చిన పనికోసం వెతుకుతూ ఖాళీగా ఉంటే రోజు గడవడం కష్టమవుతుంది కదా అని బాధ పడుతూ ఉండేవాడు. ఇలా ఒకరోజు డబ్బు సమస్య వచ్చి సోషల్ మీడియాలో తనకు స్నేహితులుగా ఉన్నవారికి డబ్బు అవసరం ఉందంటూ చెప్పాడు. స్నేహితులు, బంధువులే సహాయం చేయని ఈ కాలంలో ఎవరు పంపిస్తారులే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. అనూహ్యంగా… ట్విట్టర్‌లో అతన్ని ఫాలో అవుతున్న కొంతమంది అతని ఇబ్బందిని అర్థం చేసుకుని డబ్బు పంపించారు. అలా వచ్చిన సొమ్ము మొత్తం లెక్కవేస్తే 400 పౌండ్లు అయ్యాయి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 40 వేలు. గతంలో అతను ఒక రెస్టారెంట్లో పనిచేస్తే 965 పౌండ్లు అంటే దాదాపు రూ. 90 వేలు. అయితే…సోషల్ మీడియాలో ఒకసారి అడిగితేనే 40 వేల దాకా వచ్చాయి అనుకుని సంబరపడ్డాడు. అంత డబ్బు వస్తుందని అతనస్సలు ఊహించలేదు. అతని పేరు జోవాన్ హి. న్యూయార్క్‌‌లోని బ్రూక్లైన్‌లో నివసిస్తుంటాడు.  జోవాన్‌కి ఉద్యోగం చేయడం నచ్చలేదు. రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఏదీ ఇష్టంగా అనిపించలేదు.  ఆలోచించాడు. ఎన్నాళ్లు చేసినా ఇదే వ్యవహారం ఉంటుంది. నచ్చిన పనికోసం వెతుకుతూ ఖాళీగా ఉంటే రోజు గడవడం కష్టమవుతుంది కదా అని బాధ పడుతూ ఉండేవాడు. ఇలా ఒకరోజు డబ్బు సమస్య వచ్చి సోషల్ మీడియాలో తనకు స్నేహితులుగా ఉన్నవారికి డబ్బు అవసరం ఉందంటూ చెప్పాడు. స్నేహితులు, బంధువులే సహాయం చేయని ఈ కాలంలో ఎవరు పంపిస్తారులే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. అనూహ్యంగా… ట్విట్టర్‌లో అతన్ని ఫాలో అవుతున్న కొంతమంది అతని ఇబ్బందిని అర్థం చేసుకుని డబ్బు పంపించారు. అలా వచ్చిన సొమ్ము మొత్తం లెక్కవేస్తే 400 పౌండ్లు అయ్యాయి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 40 వేలు. గతంలో అతను ఒక రెస్టారెంట్లో పనిచేస్తే 965 పౌండ్లు అంటే దాదాపు రూ. 90 వేలు. అయితే…సోషల్ మీడియాలో ఒకసారి అడిగితేనే 40 వేల దాకా వచ్చాయి అనుకుని సంబరపడ్డాడు. అంత డబ్బు వస్తుందని అతనస్సలు ఊహించలేదు. 

Online Beggar

అతని ఇంటికి అద్దె కడతానని…

అడగ్గానే ఇచ్చిన తన ఫాలోవర్లకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అతని తెలీలేదు. తనకెలాగు ఉద్యోగం ఇష్టం లేదు కాబట్టి వారు మరింత సొమ్ము ఇచ్చేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం…రోజూ ఆన్‌లైన్‌కి వెళ్లి వారితో చాలా సన్నిహితంగా, సరదాగా చాట్ చేసేవాడు. వారిని సరదా సరదా మాటలతో నవ్వించడం, కబుర్లు చెప్పడం అలవాటు చేసుకున్నాడు. అతనలా నవ్విస్తూ ఉంటే అందరికీ బాగా నచ్చాడు. అప్పటినుంచి అతను అడగకకుండానే బిచ్చం వేయడం మొదలుపెట్టారు. ఒకరైతే అతనున్న ఇంటికి అద్దె కూడా కడతానంటూ ముందుకు రావడం గమనార్హం. 
జోవాన్‌కు 1.10 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. పైగా జోవాన్ స్వలింగ సంపర్కుడు. ఇది తెలిసీ మరింత మంది అతన్ని ఇష్టపడటం మొదలుపెట్టారు. జోవాన్ కూడా తన ఫాలోవర్లను ఇబ్బంది పెట్టలేదు. చక్కటి సెన్సాఫ్ హ్యూమర్‌తో నిత్యం నవ్విస్తుండేవాడు. అతని ఫాలోవర్లు కూడా అతనికి రోజుకు ఒక డాలర్ నుంచి 100 డాలర్ల వరకూ ఇచ్చేవారు. అలా బిచ్చమెత్తుతూ జోవాన్ నెలకు రూ. 5 లక్షలు సంపాదిస్తున్నాడు. కొత్త ఐడియాతో జోవాన్‌కి జీవితమే మారిపోయింది. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *