ప్రపంచ ధనవంతురాలిగా అమెజాన్ సీఈఓ భార్య మెకంజీ

ప్రపంచ ధనవంతురాలిగా అమెజాన్ సీఈఓ భార్య మెకంజీ

25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని వద్దనుకుని విడాకులు తీసుకున్న అమెజాన్ సీఈఓ, ప్రపంచ ధనవంతుడు జెఫ్ బెజోస్ మరో విషయంలో మళ్లీ వార్తల్లో నిలిచాడు. తన కంపెనీ మొదలైన సంవత్సరంలోనే నవలా రచయిత మెకంజీని పెళ్లి చేసుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. అయితే, విడిపోతూ తన భార్యను ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిని చేయబోతున్నాడు. అదేలాగంటారా? మీరే చదవండి…

MacKenzie Bezos

ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు…

ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అతని ఆస్తుల విలువ పలు నివేదికల ఆధారంగా 137 బిలియన్‌ డాలర్లు. ఇపుడు తన భార్యకు విడాకులు ఇస్తుండటంతో ఆమెకు భరణం కింద దాదాపు 60 నుంచి 70 బిలియన్‌ డాలర్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అంటే, మన దేశ కరెన్సీలో దాదాపు నాలుగన్నర లక్షల కోట్లు. ఈ దెబ్బతో ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారనుంది. 

ఇదే సందర్భంలో వారు మాట్లాడుతూ…25 ఏళ్లుగా భార్యభర్తలుగా మేము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా ఉంటామని బెజోస్ తెలిపాడు. ఇద్దరం ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు  చెప్పారు. అయితే, ఇద్దరికీ సంబంధించిన వెంచర్లు, ప్రాజెక్టుల్లో కలిసే ఉంటామని ప్రకటించారు. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *