ఏపీ పోలీసులపై నాకు నమ్మకం లేదు: జయరామ్‌ భార్య పద్మశ్రీ

ఏపీ పోలీసులపై నాకు నమ్మకం లేదు: జయరామ్‌ భార్య పద్మశ్రీ
జయరామ్ హత్య ఘటనకు సంబంధించి ఏ1 ముద్దాయి రాకేష్‌ రెడ్డిపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 46/19, ఐపీసీ సెక్షన్ 302 కింద తొలుత కేసు నమోదు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి వెల్లడించారు. ఆ తరవాత హత్యా నేరానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 419, 342, 346, 348, 384, 201, 202ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.
 
మరోవైపు, ఈ కేసు నుంచి శిఖా చౌదరిని వ్యూహాత్మకంగానే తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిఖా చౌదరిది క్రిమినల్‌ మైండ్‌ అని జయరాం భార్య పద్మశ్రీ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఐతే, పోలీసులు మాత్రం జయరామ్‌ హత్యకేసులో శిఖా పాత్రే లేదని స్పష్టం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. శిఖాని రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయరాం కేసులో శిఖాని కావాలనే తప్పించారని మృతుడు జయరాం భార్య పద్మశ్రీ చెప్పకనే చెబుతున్నారు.

 మొత్తం మీద ఓ వైపు మొదటి నుంచి వినిపించిన వార్తలను కొట్టి పారేస్తూ నందిగామ పోలీసులు శిఖా చౌదరికి క్లీన్‌ చిట్‌ ఇవ్వడం.. మరోవైపు రాకేష్‌ రెడ్డి బలమైన సెక్షన్ల కింద కేసులు పెట్టకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *