బుమ్రా అరుదైన ఘనత

బుమ్రా అరుదైన ఘనత

ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణరత్నేను ఔట్‌ చేయడం ద్వారా బుమ్రా వందో వికెట్‌ను సాధించాడు. ఫలితంగా భారత్‌ తరఫున ఆ ఫీట్‌ను వేగవంతంగా సాధించిన రెండో బౌలర్‌ బుమ్రా గుర్తింపు పొందాడు. తన 57వ వన్డే మ్యాచ్‌లో బుమ్రా వందో వికెట్‌ మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో మహ్మద్‌ షమీ ఉన్నాడు. షమీ 56 వన్డేల్లో ఈ మార్కును చేరగా, బుమ్రా తర్వాత స్థానంలో నిలిచాడు. ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌(59), జహీర్‌ ఖాన్‌(65), అజిత్‌ అగార్కర్‌(67), జవగళ్‌ శ్రీనాధ్‌(68)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *