ఆక్వామెన్ కలెక్షన్ల దుమ్ము రేపుతోంది

ఆక్వామెన్ కలెక్షన్ల దుమ్ము రేపుతోంది

జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఆక్వామెన్‌’. అంబర్‌ హియర్డ్‌, నికోలే కిడ్‌మెన్‌, విలియమ్‌ డెఫోయ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ‘సముద్రపుత్రుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 14న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ డాలర్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది.

aquaman box office collection

ప్రేక్షకులు ఫిదా

ముఖ్యంగా, ఆక్వామెన్‌గా చేసిన జాసన్ మెమోవా నటన, యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విడుదలైన మొదటిరోజు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా ఆడుతోంది. ఈ ఏడాది విడుదలైన బ్యాట్స్‌మెన్ వర్సెస్ సూపర్‌మెన్, వండర్ ఉమెన్ చిత్రాల తర్వాత అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *