ఆమె సంకల్పం ముందు గమ్యం చిన్నది

ఆమె సంకల్పం ముందు గమ్యం చిన్నది

పోటీలో నిలబడితే లక్ష్యం చేరేదాకా ఆగకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా ముందుకే వెళ్లాలి. అయితే, దీన్ని ఎంతమంది తమ గమ్యం కోసం పాటిస్తారు. చాలామంది ఏదైనా సాధించాలనుకున్నపుడు మధ్యలో వచ్చే అవాంతరాలను అధిగమించలేక సగంలో వదిలేస్తారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఏది ఏమైనా తన లక్ష్యం చేరాలని ధృఢ సంకల్పంతో చేసిన ఒక పని ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏం జరిగింది…

జపాన్‌కు చెందిన క్రీడాకారిణి రీ లిడా ఒక పరుగుపందెంలో చూపిన సాహసానికి అందరూ ఫిదా అయిపోయారు. 42 కిలోమీతర్ల మారథాన్ జరుగుతున్న సమయంలో రీ లిడా తన వంతుగా వచీన 3.5 కిలోమీటర్లను పరిగెత్తడానికి సిద్ధమైంది. ఇంకా 700 మీటర్లు ఉండగా తన కాలికి గాయమైంది. కాలి ఫ్యాక్తర్ అయింది. జట్టు మేనేజర్ పరిగెత్తడం కుదరదు, కాలికి పెద్ద గాయం అయిందని చెప్పినా వినకుండా మిగిలిన దూరాన్ని పాక్కుంటూ వెళ్లి ముగించింది. జట్టు మేనేజర్ వారించినా ఇంకా పూర్తిచేయాల్సిన దూరాన్ని అడిగి మరీ తన టీమ్ ఇచ్చిన బాధ్యతను కంప్లీట్ చేసింది. రీ లిడా స్పూర్తిని చూసిన సహచర క్రీడాకారిణీలు, స్టేడియంలో ప్రేక్షకులు గట్టిగా చప్పట్లతో ఆమెను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రీ లిడా సంకల్పానికి ఆశ్చర్యపోయిన నెటిజన్లు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *