తానేంటో చెప్తున్న పవన్‌ రైతుకూలీ బిడ్డకు పార్వతీపురం టిక్కెట్టు

తానేంటో చెప్తున్న పవన్‌ రైతుకూలీ బిడ్డకు పార్వతీపురం టిక్కెట్టు

సీట్ల కేటాయింపులో తానేంటో పవన్‌ చెప్పేస్తున్నాడు.కొత్తజాబితాలో వినూత్న శైలిని అనిసరిస్తూ ఒక్కసారిగా అందరి దృష్టినీ తనవైపు మరల్చుకుంటున్నాడు.దశాబ్ధాలుగా రాజకీయ చదరంగంలో ఆరితేరిన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు డిఫ్రెంట్‌గా అడుగులు వేస్తున్నాడు.సీట్ల కేటాయింపు విషయంలో ఆడినమాట మీద నిలబడుతున్నాడు.అవకాశాలను సామాన్యల నుంచే మొదలుపెడుతున్నాడు.దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

వేడివేడిగా…

భానుడి ప్రతాపానికి రాజకీయాల వేడీ తోడైంది.వాతావరణం హాట్‌హాట్‌గా మారిపోయింది.వ్యూహప్రతివ్యూహాల నడుమ పోరు రసవత్తరంగా మారుతోంది.ఎత్తులకు పైఎత్తుల అడుగులు పడుతున్నాయి.టీడీపీ, వైసీపీలకు ధీటుగా జనసేనను పవన్ నడిపిస్తున్నాడు.తాజాగా విడుదల చేసిన ఐదో జాబితా సీట్లతో సామాన్యులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.నమ్మకాలను నిలబెట్టుకునే విధంగా తన పంథాను రచించుకుంటున్నాడు.

రైతుకూలీ బిడ్డకు

రాజకీయ ఆరంగ్రేటం చేసేముందే…తాను అధికారం కోసం కాదూ మార్పుకోసం వచ్చానని పవన్‌ కళ్యాణ్‌ తెగేసి చెప్పాడు.అయితే తొలిదశల్లోని సీట్ల కేటాయింపుల్లో ఆ ముద్ర కనిపించలేదు.జనసేన అడుగులూ అన్ని పార్టీల్లానే అనిపించాయి.అభ్యర్థుల జాబితా చివరికి వచ్చేసరికి పవన్‌ జాగ్రత్త పడుతున్నాడు.సామాన్య,మధ్యతరగతి కుటంబాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. తాజాగా 16 మందితో ఉన్న ఐదో జాబితాను విడుదల చేశాడు.ఈ 16 మందిలో ఎక్కువగా విద్యావేత్తలూ,మధ్యతరగతికి చెందిన వారే ఉన్నారు.వ్యవసాయకూలీ గంపస్వామి బిడ్డ గౌరీ శంకరరావుకు పార్వతీపురం టిక్కెట్టును కేటాయించాడు.శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టిక్కెట్‌నూ రిటైర్డ్‌ ఆర్టీసీ కండెక్టర్‌ కొడుకు గేదెల చైతన్యకు కేటాయించాడు.ఈ నిర్ణయాలపై అన్నిచోట్ల నుంచీ పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.ఆడినమాటను పవన్‌ తప్పడని అతడి అభిమానులు ఎప్పటిలానే ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *