గంగవరం మొత్తం జనసేనకే జై కొట్టిందా?

గంగవరం మొత్తం జనసేనకే జై కొట్టిందా?

గాజువాకలో పై చేయి ఎవరిది? ట్రయాంగిల్ ఫైట్‌లో పవన్ నెగ్గుకొస్తారా? గంగవరం మొత్తం జనసేనకే జై కొట్టిందా? మరి, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? మూడు పార్టీల మధ్య రసవత్తరంగా జరిగిన పోటీలో…గ్లాసు కిక్ ఇస్తుందా? ఇంతకీ గాజువాక ఓటర్ల చూపు ఎటు వైపు… ?

విశాఖ జిల్లా గాజువాకలో గెలిచేదెవరన్నది ఉత్కంఠను రేపుతోంది. జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలోమొత్తం 3,09,326 ఓటర్లున్నారు. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి, జనసేన నుంచి పవన్ పోటీ చేశారు. ఇక్కడ ప్రధానంగా పవన్ గెలుపోటముల అంశం రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. గాజువాక నియోజకవర్గంలో పోలింగ్‌ సరళి ఉత్కంఠ భరింతంగా సాగింది. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు వరకు వైసీపీ-జనసేనల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కూడా గట్టి పోటీనివ్వడంతో ట్రై సిరీస్‌గా మారింది.

గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ మండలంలోని గంగవరం గ్రామస్తులు జనసేనకు మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. గతేడాది పవన్ గంగవరంలో పర్యటించి మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గంగవరం పోర్టు కాలుష్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్తులు పవన్‌కు వివరించారు. ఈ సందర్భంగా పవన్ తమ పార్టీ అధికారంలోకి రాగానే, బాధిత మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ఉపాధి, మత్స్యకారులకు జీవన భృతి అందజేస్తామన్నారు. మత్స్యకారుల కోసం కొత్తగా జట్టీలు నిర్మిస్తామని చెప్పారు. ఈనేపథ్యంలో గంగవరంలో 50శాతానికి పైగా జనసేనకు ఓట్లు పడినట్టు అంచనా వేస్తున్నారు.

పవన్ తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. జ‌న‌సేన అధికారంలోకి రాగానే అగ‌నంపూడిని ప్రత్యేక రెవెన్యూ డివిజ‌న్ చేయడంతో పాటు.. అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. జ‌నాభా నిష్పత్తి ఆధారంగా నియోజ‌క‌వ‌ర్గానికి అవ‌స‌ర‌మైన‌న్ని గ‌వ‌ర్నమెంటు కాలేజీలు ఏర్పాటు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. వ‌ర్కింగ్ ఉమెన్స్ హాస్పిటల్స్, ప్రతి డివిజ‌న్‌లో శిశు సంర‌క్షణా కేంద్రాలు, ప్రత్యేక మ‌హిళా పోలీస్ స్టేష‌న్‌లు, నిరాధార‌ణ‌కు గుర‌వుతున్న వృద్దుల కోసం ప్రతి డివిజ‌న్‌లో పెద్దల ఆద‌ర‌ణ నిల‌యాలు, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు లాంటి హామీలను

ఇదిలా ఉంటే, పవన్‌కల్యాణ్‌కు గాజువాకలో ఆది నుంచి పలు అవాంతరాలు ఎదురయ్యాయి. ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు కూడా పవన్‌ విజయావకాశాల్ని సంక్లిష్టం చేశాయని తెలుస్తోంది. చాలామంది పవన్‌ అభిమానులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చినా.. ఈవీఎంలు మొరాయించడంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. ఏది ఏమైనప్పటికీ, సినీ గ్లామర్‌కు తోడు సొంత సామాజిక వర్గం, వామపక్షాలు- బీఎస్పీతో పొత్తు సహా…. ప్రత్యేక హామీల వల్ల గాజువాకలో పవన్ గెలుపు ఖాయమని జనసేన పార్టీ నమ్ముతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *