ఆ రెండు చోట్లా...రాసిపెట్టుకోండి

ఆ రెండు చోట్లా...రాసిపెట్టుకోండి

ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతుంది.ఎలక్షన్ల సైరన్‌ మోగినప్పటి నుంచీ వ్యూహప్రతివ్యూహాలు నడుస్తూనే ఉన్నాయి.అభ్యర్థుల చిట్టాను ఆయా పార్టీలు ప్రకటించేస్తున్నాయి.గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఒక అనూహ్యమైన మార్పు వచ్చింది.దాని పేరు పవన్‌ కళ్యాణ్.జనసేన పార్టీతో టీడీపీ,వైసీపీలకు పోటీనిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.ఇందులో ఎంత వరకు విజయం సాధిస్తాడో తెలియాలంటే ఇంకొద్ది కాలం ఆగాల్సిందే.విజయం సాధించిక పోయినా పవన్ ప్రభావం కచ్ఛితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పవన్‌ సినిమా స్టార్ అవడంతో వీటన్నింటికీ అతీతంగా ఉండే క్రేజ్‌ వెంటాడుతూనే ఉంది.ఆ ఆసక్తే పవన్‌ ఎక్కడినుంచి పోటీచేయబోతున్నాడనే అంశం మీద అందరి దృష్టినీ మరల్చేలా చేసింది.ఇప్పుడు ఆ విషయం బయటికి వచ్చేసింది.ఇంతకీ ఎక్కడినుంచి వపన్‌ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నాడో తెలుసుకోవాలంటే…ఈ స్టోరీలో ఇంకాస్త ముందుకెళ్లాల్సిందే…

ఆ రెండు చోట్లా…

పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడో తేలిపోయింది.గతంలో చిరూ చేసినట్టే రెండు స్థానాల నుంచి పోటీచేసేందుకు ఫిక్స్‌ అయిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం,విశాఖజిల్లా గాజువాకల నుండి పోరుకు పవన్ సిద్ధమవుతున్నాడు.ప్రజారాజ్యం తరపున చిరూ కూడా పాలకొల్లు,తిరుపతిల నుంచీ పోటీ చేసిన విషయాన్ని అభిమానులు గుర్తుచేసుకున్నారు.అయితే పవన్‌ నామినేషన్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.స్థానాలు మాత్రం దాదాపు ఖాయమనే తెలుస్తోంది.రేపటిలోగా నామినేషన్‌ ఎప్పుడు వేస్తారనే విషయంపైనా క్లారిటీ రానుంది.మరో పక్కనుంచి పవన్ అభిమానులు సంబరాలు మొదలయ్యాయి.ఆ రెండు స్థానాల్లోనూ తమ పార్టీకి తిరుగులేదనీ,అఖండ మెజారిటీతో పవన్‌ గెలుపించుకుంటామనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆ రెండు స్థానాల్లోనూ భారీ విజయలాను జనసేన తరపుర రాసిపెట్టుకోమని ఛాలెంజ్‌ చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *