65 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది

65 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది

సహజంగా ఆడవారికి ఋతుక్రమం 45 ఏళ్లకు ముగుస్తుంది. ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత మళ్లీ గర్భం దాల్చడం అసంభవం. కానీ జమ్మూ కాశ్మీర్‌లోని ఓ మహిళ 65 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వైద్య చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని వైద్యులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా ఆసుపత్రిలో 65 ఏళ్ల వృద్ధ మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె భర్త హకీం దిన్ వయస్సు 80 ఏళ్లు కావడం ఇక్కడ మరొక విశేషం. ఈ దంపతులకు ఇదివరకే పదేళ్ల కొడుకు ఉన్నాడు.

Kashmiri woman

ప్రపంచ రికార్డు

ఇప్పటిదాకా ప్రపంచంలో లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన రికార్డు స్పెయిన్ దేశస్థురాలు 66 ఏళ్ల మారియా డెల్ కార్మెన్‌కు ఉంది. కాకపోతే, ఆమె ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. ఈ కోణంలో చూస్తే లేటు వయసులో సహజంగా బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా హకీం భార్యకు ప్రపంచ రికార్డు సాధించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *