ఓ ముద్దాయి వద్ద 3 బంగారు ఉంగరాలు నొక్కేసిన జైలు అధికారులు

ఓ ముద్దాయి వద్ద 3 బంగారు ఉంగరాలు నొక్కేసిన జైలు అధికారులు

నల్గొండ జైలులో.. ఓ ఖైదీవి మూడు బంగారు ఉంగరాలు నొక్కేశారు జిల్లా జైలు అధికారులు. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న శ్రవణ్ కుమార్‌ను రిమాండ్ తరలించే సమయంలో.. లక్ష రూపాయలు విలువ చేసే మూడు ఉంగరాలను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖైదీ బెయిలు పై బయటకొచ్చాక తన ఉంగరాలు ఇవ్వాలని అడగ్గా కనపడడం లేదని తాపీగా సమాధానం ఇచ్చారు. దీంతో శ్రవణ్‌ డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తాననడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. నల్గొండ వన్ టౌన్ లో ఫిర్యాదు చేసి విచారణ జరుపుతున్నారు. జైలర్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *