చంద్రబాబుకు షాక్‌ మీద షాక్

చంద్రబాబుకు షాక్‌ మీద షాక్

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు తేరుకోలేనన్ని షాక్‌లు తగులుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు చంద్రబాబు భద్రత తగ్గించిన ప్రభుత్వం… ఇప్పుడు వారి ఫ్యామిలీకి కూడా కల్పించే సెక్యూరిటీని కుదించారు. జడ్ కేటగిరీ ఉన్న లోకేష్ కు 5 ప్లస్ 5నుంచి… 2 ప్లస్ 2 గన్ మెన్లకు భద్రత తగ్గించింది. మిగిలిన కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు కల్పిస్తున్న భద్రతను పూర్తిగా తొలగించింది.

అసెంబ్లీ సమావేశాలకు ముందే చంద్రబాబు సెక్యూరిటీలో కూడా కోత కోశార అధికారులు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే సమయంలో రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్లే పైలట్ వాహనాన్ని ప్రభుత్వం తీసేసింది. దీంతో పాటు కాన్వాయ్ వెనకాల వచ్చే ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించింది. ముందు వెళ్తున్న ఎనిమిది వాహనాల్లో ఏదైనా సమస్య తలెత్తినా… వెనుకాల నుంచి గుర్తుతెలియని వాహనాలు ఏమైనా ఫాలో అయితే అప్రమత్తం చేస్తే ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ప్రభుత్వం తగ్గించేసినట్లు చంద్రబాబు సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ వర్గాలు. జగన్ ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించడాన్ని తప్పు పడుతున్నాయి. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు అవసరమైన భద్రత కల్పించామని చెబుతున్నాయి. జగన్ ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *