కేంద్ర బడ్జెట్ 2019: ఇస్రో నుంచి సంపద సృష్టించే కార్యక్రమం

కేంద్ర బడ్జెట్ 2019: ఇస్రో నుంచి సంపద సృష్టించే కార్యక్రమం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొన్నేళ్లుగా సాధిస్తున్న వరుస విజయాలను కొనియాడుతూ…దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక అంశాలను ప్రస్తావించారు. అంతరిక్షానికి సమబంధించిన కార్యక్రమాల ద్వార సంపదను ఆర్జించే విధంగా నిర్ణయాలు తీసుకోనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇందులో భాగంగా ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ పేరుతో కొత్త కార్యాచరణను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

అంతరిక్షం నుంచి సంపద సృష్టి…

ఈ సందర్భంలో మాట్లాడుతూ…’భారతదేశం అంతరిక్ష శక్తిగా ఎదిగింది. అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యంలో పడేసింది. ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఈ నేపథ్యంలోనే ఇస్రో కార్యక్రమాలను మరింతగా విస్తృతం చేసి ఆర్థికంగా లబ్ధి పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. చంద్రయాన్-2 ప్రయోగానికి సమాయత్తమైన తరుణంలో ఇస్రో ఖ్యాతిని మరింత పెంచేలా ఈ చర్యలు తోడ్పడనున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల ద్వారా అంతరిక్ష కార్యక్రమాలను వాణిజ్య పరంగా విస్తరించడానికి ఇదే సరైన సమయం. దీనికోసం ప్రభుత్వ రంగంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నాం. ఇస్రో ద్వారా ప్రయోజనాలు పొందే విధంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పనిచేస్తుందని ‘ నిర్మలా సీతారామన్ వివరించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *