విడుదలకి ముందు ఇస్మార్ట్ శంకర్ కి భారీ షాక్..మరి ఇంత దారుణమా..!!

విడుదలకి ముందు ఇస్మార్ట్ శంకర్ కి భారీ షాక్..మరి ఇంత దారుణమా..!!

ఇస్మార్ట్ శంకర్… పూరి డైరెక్షన్ లో డబల్ ధిమాఖ్ ఉన్న హీరోగా రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ… పూరికి చాలా రోజుల తర్వాత భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయి మంచి విజయం అందుకుంటుంది అనుకుంటుంటే ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కి పెద్ద కష్టం వచ్చింది. జులై 18న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమాకి థియేటర్స్ దొరకట్లేదు. నైజాం లాంటి ఏరియాలో దిల్ రాజుని సంప్రదించగా, దిల్ రాజు తనకి వేరే సినిమాల కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నానని, ఇస్మార్ట్ శంకర్ సినిమాకి థియేటర్స్ ఇవ్వడం కష్టమని, వీలైతే చూద్దామని తేల్చి చెప్పాడట… దిల్ రాజు ఆ మాట అనడంతో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయోమయంలో పడింది.

పూరి లాంటి దర్శకుడి సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే. అయితే ఒక్క సరైన హిట్ పడితే ఇప్పుడు పూరి రిజెక్ట్ చేస్తున్న వాళ్లే మళ్లీ అతని వెనక తిరుగుతారు. గతంలో పూరి పని అయిపొయింది అనుకున్న ప్రతిసారి, అతను కంబ్యాక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు ఆపినా ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ మాత్రం ఆగదు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఇస్మార్ట్ శంకర్ హిట్ అయితే మాత్రం… పూరి దెబ్బకి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *