ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిల్ స్టార్ రామ్,డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం`ఇస్మార్ట్ శంకర్’.నిధి అగర్వాల్,నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం చివరి దశ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ని జులై 12 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు.
అతి త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారిక ప్రకటన చేసి..ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ పెంచాలని చూస్తున్నారు.రీసెంట్ గా శంకర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై ఆకట్టుకుంది.రామ్ రఫ్ గా కనిపిస్తూ ఊర మాస్ గా కనిపించాడు. ‘పతా హై మై కౌన్‌ హూ..శంకర్‌..ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’అంటూ రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెపుతూ..డ్యాన్స్‌,ఫైటింగ్‌ లతో ఆకట్టుకున్నాడు.’నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.మరి సినిమా పూరికి,రామ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *