వరల్డ్ కప్ ఎఫెక్ట్ ... ఇస్మార్ట్ శంకర్ వాయిదా

వరల్డ్ కప్ ఎఫెక్ట్ ... ఇస్మార్ట్ శంకర్ వాయిదా

క్రికెట్ ఎఫెక్ట్ మన సినిమాలపై ఎప్పుడూ ఉంటుంది… ఈసారి వరల్డ్ కప్ ఇంపాక్ట్ ఒక కుర్రాడి సినిమాపైనే పడి… అతని సినిమా వాయిదా పడే వరకు వెళ్లిందట… మరి క్రికెట్ మేనియా తట్టుకోలేక సినిమాని వాయిదా వేసుకున్న ఆ స్మార్ట్ హీరో ఎవరో చూడండి

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇంగ్లాండ్ లో జరుగుతున్న వరల్డ్ కప్ గురించే చర్చలు జరుగుతున్నాయి… అయితే ఈ వరల్డ్ కప్ మేనియా పుణ్యమాని ఎనర్జిటిక్ హీరో రామ్, పూరితో కలిసి చేస్తున్న ఇస్మార్ట్ ,శంకర్ సినిమాని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఇస్మార్ట్ శంకర్ సినిమా జులై 12న విడుదల కావాల్సి ఉండగా… అది కాస్త వారం వెనక్కి వెళ్లింది.

టీజర్ నుంచి సాంగ్స్ వరకూ బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ హైప్ క్రియేట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్, ఇక జులై 12 హిట్ కొట్టడమే అనుకుంటున్న సమయంలో ఈ సినిమాను జులై 12 నుంచి జులై 18 కి వాయిదా వేసుకున్నారు. డేట్ మారినా రిజల్ట్ మారదని ఇస్మార్ట్ శంకర్ ఫిల్మ్ యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. మరి వరల్డ్ కప్ ఎఫెక్ట్ తగ్గగానే… మన ఇస్మార్ట్ శంకర్ మేనియా మొదలవుతుందేమో చూడాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *