రాజకీయ కురువృద్ధుడికి ప్రధాని అవకాశాలు ఇంకా ఉన్నాయా?

రాజకీయ కురువృద్ధుడికి  ప్రధాని అవకాశాలు ఇంకా ఉన్నాయా?

గత ఐదేళ్లుగా ఆయనను చూస్తుంటే రాజకీయ భీష్ముడు గుర్తొస్తారు. మరోసారి విల్లంబులు పడేసిన అర్జునుడు కనిపిస్తాడు. ఇంకోసారి..రాజకీయ చతురుత కనిపిస్తుంది. 2 సీట్ల పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన కమలరథ సారధి. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది ఆయనెవరో. ప్రస్తుతం సాగుతున్న సీట్ల అంచనాలు ఆ రాజకీయ కురువృద్ధుడికి కలిసి వచ్చే అవకాశముంది. ఎలానో..మోజో ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం.

ఎవరి తల రాతలు ఎలా ఉంటాయో తెలియదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఏ టైమ్ ఎలా ఉంటుందో చెప్పలేం. మే 23న ఫలితాలు తరువాత చాలా ట్విస్ట్‌లు ఉండే అవకాశముంది. అందరూ భావిస్తున్నట్లు అయితే ఎన్డీయే వైపు నుంచి మోడీ – కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థులు.అనధికారికంగా మాత్రం బోలెడంత మంది రేసులో ఉన్నారు. తాము రేసులో ఉన్నట్టుగా ప్రకటించుకున్న వాళ్లు తాము రేసులో లేనట్టుగా ప్రచారం చేసుకుంటున్న వాళ్లు.. అసలు ఎవరి ఊహగా అందని వారు కూడా ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నట్టే. అలా ఉంది రాజకీయం.

ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఎన్‌డీఏకు కానీ, యూపీఏకు గాని పూర్తి మెజార్టీ వచ్చే సూచనలు కనిపించడంలేదు. సో….పీఎం పీఠం చేరుకోవడానికి చాలా మలుపులు ఉంటే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో జాక్‌ పాట్ పీఎంలు చాలా మంది అవుతుంటారు. లైక్…దేవేగౌడ, గుజ్రాల్ అయినట్లు .

ఎన్టీయేకు పూర్తి మెజార్టీ రాకపోతే…అద్వానీకి పీఎంగా అవకాశముందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఐదేళ్లు మౌన మునిగా ఉన్న అద్వానీ మృధుస్వభావి. చాలా పార్టీలకు అమోదయోగ్యుడు. 2014 నుంచి అద్వానీని మోదీ – అమిత్ షాలు పక్కన పెట్టేశారు. ఈ ఎన్నికల్లో ఆయనను ఎంపీగా కూడా బరిలోకి దించలేదు. కానీ….ఎన్‌డీఏ సరిపడ సీట్లు గెల్చుకోకపోతే..కొత్త మిత్రులు అవసరమవుతారు. కొత్త మిత్రులు మోదీని ఒప్పుకోక పోతే..ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి దిగే అవకాశముంది. సో..అందరికీ ఆమోదయోగ్యుడైన అద్వానీని ముందు పెట్టవచ్చు. ఏమో..గుర్రం ఎగరావచ్చు కదా?.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *