మలయాళ భామ అనుపమ, క్రికెటర్ బుమ్రా ప్రేమ గొడవ...

మలయాళ భామ అనుపమ, క్రికెటర్ బుమ్రా ప్రేమ గొడవ...

సినిమా స్టార్లు క్రికెటర్లను ప్రేమించడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త. ఈ రెండు రంగాలకు ఉన్న క్రేజ్ మరే రంగానికి లేదు కాబట్టే ప్రేక్షకులు, అభిమానులు వీరి ప్రేమకు జై కొడతారు. పైగా వీరికి సంబంధించి ఏ వార్తనైన క్షణాల్లో సోషల్ మీడియాకు ఎక్కించి పబ్లిక్ చేసి పడేస్తున్నారు. అయితే…ఇందులో ఎంతవరకూ నిజం ఉంది, అబద్ధం ఎంత ఉంది అనే ప్రాధమిక ఆలోచనను ఇటు ప్రేక్షకులుగానీ, అభిమానులుగాని కలగకపోవడం విచారం.

గతంలోనూ ఇదే!

గతంలో క్రికెటర్లు సినిమా తారలను చేసుకున్న సందర్భాలున్నాయి. ఈ మధ్యనే విరాట్, అనుష్క శర్మల పెళ్లి ఎంత పెద్ద వార్త అయిందో తెలిసిందే! నిజంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారి సంగతి పక్కనబెడితే రూమర్ల దెబ్బకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక సతమతమైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి రూమర్లు విని తలలు పట్టుకున్న వారిలో గంగూలీ, ధోనీ, రైనా, జడేజా, పాండ్యా లాంటి క్రికెటర్లు ఉన్నారు. వీరి గురించి రకరకాల రూమర్లు బయటకు వచ్చాయి కాని అందులో ఎలాంటి వాస్తవమూ లేదు.

Anupama

ఒకరినొకరు లైక్ చేసుకోవడం…

ప్రస్తుతం ఇలాంటి రూమరే యంగ్ బౌలర్ బుమ్రాకు కూడా ఎదురైంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో తనదైన శైలిలో బాల్‌తో చెలరేగుతున్న ఈ బౌలర్..మలయాళ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ని కూడా క్లీన్‌బౌల్డ్ చేశాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రేమమ్ సినిమా జాతీయ స్థాయిలో కుర్రకారుని కదిలించీ ఈ భామ బుమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందని వార్త వచ్చింది. దీన్ని నిజమనుకునేలా వీరి వ్యవహారం కూడా నడిచింది. బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడం. అనుమపా కూడా బుమ్రాను ఫాలో కావడం. ఒకరి పోస్ట్‌లను మరొకరు లైక్ చేసుకోవడం, షేర్ చేసుకోవడంతో అందరూ నిజమనే అనుకున్నారు. ఇద్దరికీ ఏదో ఉందని ప్రచారం కూడా చేసేశారు. దీని గురించి అనుమపమ వరకూ వెళ్లడంతో తను కూడా ఘాటుగానే స్పందించింది. లవ్వూ..గివ్వూ లాంటివేం లేవు. ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తారు అంటూ కోప్పడింది. బుమ్రా నాకు మంచి స్నేహితుడు అంతే…మా ఇద్దరి మధ్య ఇంకేం లెదని స్పష్టం చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *