రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్ VS కింగ్స్ లెవన్‌ పంజాబ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్ VS కింగ్స్ లెవన్‌ పంజాబ్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది.ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది.ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి.2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న నలభై రెండో మ్యాచ్‌లో బెంగుళూరు వేదికగా ఈ రోజు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌,కింగ్స్ లెవన్‌ పంజాబ్‌  తలపడున్నాయి.ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది.దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌మోజో ప్రెడిక్షన్‌… 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌ VS కింగ్స్ లెవన్‌ పంజాబ్‌…బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి.ఈ గ్రౌండ్‌ స్వతహాగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.కొన్నికొన్ని సార్లు బౌలింగ్‌కూ సహకరిస్తుంది.స్లో డెలివరీలు మంచి ఫలితాన్నిస్తాయి.ఒకసారి బ్యాట్స్‌మెన్‌ కుదురుకుంటే భారీ పరుగులు వస్తాయి.స్పిన్నర్లతో పోల్చితే సీమర్లకు అనుకూలంగా ఉంటుంది.

160 ని కాపాడుకోవచ్చు…

కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే 160 పరుగులనూ కాపాడుకోవచ్చు.తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు సహకరించడం మొదలు పెడితే…సునాయసంగా 200 పరుగులు చేయవచ్చు.పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు ఎంత మేరకు సహకరిస్తుందో…తొలి రెండు ఓవర్లలోనే తేలిపోతుంది.ఇరు జట్ల బలాబలాలనూ అంచనా వేసాక,రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *