రాజస్థాన్‌ రాయల్స్‌ VS కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ VS కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది.ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది.ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి.2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో జైపూర్‌ వేదికగా ఈ రోజు రాజస్థాన్‌ రాయల్స్‌,కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌లు తలపడున్నాయి.ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది.దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌… 

రాజస్థాన్‌ రాయల్స్‌,కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌లు జైపూర్‌లోని స్వామీ మాన్‌సింగ్‌ స్టేడియంలో తలపడనున్నాయి.ఈ గ్రౌండ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది.స్పిన్‌ బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలూ పెట్టగలరు.పేస్ బౌలర్లకూ,మీడియం ఫాస్ట్‌ బౌలర్లకూ అనుకూలంగానే ఉంటుంది.గత సీజన్‌లో ఈ గ్రౌండ్‌లో ఈ రెండు టీమ్‌లూ రెండు సార్లు తలపడ్డాయి.ఒక మ్యాచ్‌ లో రాజస్థాన్‌ విజయం సాధిస్తే మరో మ్యాచ్‌లో పంజాబ్‌ నెగ్గింది.

165 దాటితే విజయమే… 

టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 165 పరుగులను దాటితే కష్టతరమైన టార్గెట్‌ను ఉంచినట్టే.రెండు జట్లనూ పోల్చిచూస్తే…స్పిన్‌ను ధీటుగా ఎదుర్కోగలిగిన వాళ్లు రాజస్థాన్‌ జట్టులోనే ఉన్నారు.తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు…140 పరుగులు చేసినా…దాన్ని కాపాడుకోగల పరిస్థితులు ఉంటాయి.పిచ్‌ను బట్టి సామర్థ్యాలను అంచనా వేస్తే…రాజస్థాన్‌ రాయల్స్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కీలకంగా మారబోయే ఆటగాళ్లు…

అజంక్యా రెహనే,టీవన్‌ స్మిత్‌,బట్లర్‌,ఆర్చర్‌,క్రిష్ణప్ప గౌతమ్‌ (రాజస్థాన్‌ రాయల్స్)
లోకేష్ రాహుల్,అశ్విన్‌,ముజ్బీర్ రెహమాన్‌,కరుణ్ నాయర్‌ (కింగ్స్‌ లెవన్ పంజాబ్‌)

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *