ఐపీఎల్‌కు అదిరే ముగింపు

ఐపీఎల్‌కు అదిరే ముగింపు

ఐపీఎల్‌12 కు ఎలాంటి ముగింపునివ్వాలో అచ్చంగా అలాంటి మ్యాచ్‌తోనే సీజన్‌కు తెరపడింది. ఉత్కంఠ పోరులో టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్లో 1 పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబై చిరస్మరణీయ విజయం సాధించింది. స్వల్పస్కోరే అయినా పట్టుదలగా ఆడి మ్యాచ్‌ గెలిచిన రోహిత్‌ సేన నాలుగో సారి ట్రోఫీని కైవసం చేసుకుంది.ఐపీఎల్ 12 కి అదిరిపోయో ముగింపు లభించింది. మూడుసార్టు ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్ జట్లు హోరాహోరిగా పోరాడి టీట్వంటీలోని అసలైనా మజాను క్రికెట్ ప్రేక్షకులకు రుచి చూపించాయి. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ.. అభిమానులను సీట్ల అంచుల నుంచి మునివేళ్లపైకి తీసుకొస్తూ.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఫైనల్లో చివరకు ముంబైనే విజయం వరించింది.

ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే ను 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులకే కట్టడి చేయడంతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే ఛేదఐపీఎల్‌12 కు ఎలాంటి ముగింపునివ్వాలో అచ్చంగా అలాంటి మ్యాచ్‌తోనే సీజన్‌కు తెరపడింది. ఉత్కంఠ పోరులో టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్లో 1 పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబై చిరస్మరణీయ విజయం సాధించింది. నలో షేన్‌ వాట్సన్‌ 59 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సర్లు 80 పరుగులతో అసాధరణరీతిలో బ్యాటింగ్‌ చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ముంబై విజయం సాధించిందంటే ఆ క్రెడిట్‌ బౌలర్లకే చెందుతుంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 2 వికెట్లు తీసి 14 పరుగుల మాత్రమే ఇచ్చి సీఎస్‌కే నడ్డి విరిచాడు. ఇక రాహుల్‌ చహర్‌ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి 1 ఒక వికెట్ దక్కించుకొని పరుగులు కట్టడి చేశాడు. ఓ వైపు వాట్సన్ చెలరెగిపోతున్న కాని ముంబాయి మ్యాచ్ గెలిచిందటే అది బుమ్రా అద్భుత బౌలింగ్‌ చలవే. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్ రోహిత్ మలింగకు మరోసారి బంతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేసినా.. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌ల్లో బౌలిం గ్ చేసిన అనుభవం ఉన్న మలింగ 7 పరుగులే ఇచ్చి ముంబైని గెలిపించాడు.అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబాయి… కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్‌ల దూకుడుతో ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించారు. ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభించిన రోహిత్‌, డీకాక్‌లు చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో వరుస ఓవర్లలో డీకాక్‌, రోహిత్‌ లు ఔటయ్యారు. అనంతరం వచ్చిన సూర్యకుమార్‌ , కృనాల్‌ లు తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 89 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులో నిలదొక్కుకపోయిన ఇషాన్‌ కూడా ఔటయ్యాడు. దీంతో ముంబైని ఆదుకునే బాధ్యత పొలార్డ్‌, హార్దిక్‌లు తీసుకున్నారు. హర్దిక్ పాండ్యా రెండు సిక్స్‌లతో విరుచుకుపడటంతో జట్టు స్కోరు ఊపందుకుంది. అయితే హార్దిక్‌ను ఠాకుర్ పెవీలియన్‌కు పంపాడు. క్రీజులో నిలదొక్కుకున్న పోలార్డ్ ముంబాయికి గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

ప్రతి సారిలానే సీజన్‌లో అన్ని టీమ్‌లను మట్టి కరిపించే చెన్నై ముంబై పై మాత్రం ఆడిన నాలుగు మ్యాచ్‌లు ఓటమి చవిచూసింది. ఇక ముంబై నాలుగోసారి కప్పు గెలిచి రికార్డు సృష్టించింది. అద్భుత బౌలింగ్‌తో ముంబాయి విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *