కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ VS రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌

కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ VS రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది.ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది.ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి.2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఇరవై ఎనిమిదో మ్యాచ్‌లో మొహలీ వేదికగా ఈ రోజు కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌,రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌ తలపడున్నాయి.ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది.దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌…

కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌,రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌… మొహలీలోని బింద్రా స్టేడియంలో తలపడనున్నాయి.ఈ గ్రౌండ్‌ టూ పేసెడ్‌గా ఉంటుంది.ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్లో బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం కొనసాగింది. తదుపరి మ్యాచ్‌లో బౌలర్లకు అనుకూలంగా ఉంది.ఈ రోజు ఈ వేదిక మీద మూడో మ్యాచ్ జరగనుంది.బౌలర్లకు కొంతవరకూ సహకారం ఉండే అవకాశం ఉంది.ఒక మాదిరి స్కోర్లతో పోరు రసవత్తరంగానే జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 170 పరుగులు చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మొదటి బ్యాటింగ్‌కే అనుకూలం…
టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.అటు లోస్కోరింగ్‌,ఇటు హై స్కోరింగ్‌ కాకుండా ఉంటుంది.పిచ్‌ నుంచి స్పిన్నర్లకు కొద్దిపాటి సహకారం ఉంటుంది.160 నుంచి 170 పరుగుల లోపు సాధించినా పోరు రసవత్తరంగానే ఉంటుంది.సొంత మైదానం కావడం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం.మోజో అంచనా ప్రకారం పంజాబ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *