చెన్నై సూపర్‌కింగ్స్‌ VS రాజస్థాన్ రాయల్స్‌

చెన్నై సూపర్‌కింగ్స్‌ VS రాజస్థాన్ రాయల్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది.ఎన్నికల ఫలితాల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది.ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి.2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న నలభై నాలుగో మ్యాచ్‌లో చెన్నై వేదికగా ఈ రోజు చెన్నై సూపర్‌కింగ్స్‌,ముంబై ఇండియన్స్‌ తలపడున్నాయి.ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది.దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌… 

చెన్నై సూపర్‌కింగ్స్‌ VS రాజస్థాన్ రాయల్స్‌…చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది.మ్యాచ్‌ ఆసాంతం పిచ్‌ మందకొడిగానే ఉంటుంది.సీమర్లకూ, స్పిన్నర్లకూ ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది.బౌలర్లే మ్యాచ్ విన్నర్లు అయ్యే అవకాశం ఉంది.ఆచితూచి బ్యాటింగ్‌ చేసే వాళ్లకూ,బౌలింగ్‌ ట్రాక్‌ మీద రాణించగల వాళ్లకూ విజయావకాశాలు ఉంటాయి.టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంటుంది.

160 దాటితే విజయమే… 
టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పిచ్‌ స్వభావాన్ని బట్టి లో స్కోరింగ్‌ మ్యాచ్‌గా మిగులుతుంది.తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 150 పరుగులు చేసినా…ప్రత్యర్థి జట్టును అడ్డుకుని విజయం సాధించొచ్చు.160 పరుగులు దాటితే గెలుపు అవకాశాలు మరీ ఎక్కువగా ఉంటాయి.అవకాశాలాను జారవిడచకుండా ఉంటే ఈ గ్రౌండ్‌లో 140 పరుగులనైనా కాపాడుకుని విజయం సాధించవచ్చు.ఈ రెండు జట్లనూ పోల్చిచూస్తే… లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో రాణించగల సీనియర్‌ ఆటగాళ్లు ఇరువైపులా ఉండటంతో పోరు రసవత్తరంగా ఉంటుంది.మోజో అంచనా ప్రకారం…చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *