కేరళలో జర్మనీ మహిళ అదృశ్యం...ఇంటర్‌పోల్ గ్లోబల్ అలర్ట్

కేరళలో జర్మనీ మహిళ అదృశ్యం...ఇంటర్‌పోల్ గ్లోబల్ అలర్ట్

జర్మన్ నుంచి కేరళ వచ్చిన లీసా అనే మహిళ నాలుగు నెలలగా ఎక్కడా కనిపించకపోవడం సంచలనం సృష్టిస్తుంది. ఆ మహిళకు ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్టు ఇంటర్ పోల్ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో ఒక్క కేరళలోనే కాదు.. దేశ వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు.

లీసా అనే పదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోలీసులు జపం చేస్తున్న ఓ జర్మన్ దేశస్తురాలి పేరు. ఈ ఏడాది మార్చి 7న యూకేకి చెందిన అలీ మహ్మద్ అనే వ్యక్తితో లీసా కేరళలో తిరువనంతపురానికి వచ్చింది. వల్లికావు, కొల్లంలో ఉన్న మాతా అమృతానందమయ మఠాన్ని దర్శించడానికి ఇండియా వచ్చినట్టు ఆమె తన ఎంబార్కషన్ ఫామ్‌లో తెలిపింది. అయితే ఈమె ఉన్నటుండి కనిపించకపోవటంతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

లీసా కుటుంబ సభ్యులు 2011లో కూడా లీసా ఈ మఠాన్ని దర్శించడానికి వచ్చిందని… అప్పడు 2 నెలలు పాటు ఇండియాలోనే ఉందని తెలిపారు. అయితే మార్చి7న ఇండియా వచ్చిన లీసా తమతో మార్చి10 వరకు కాంటాక్ట్‌లో ఉందని తరువాత తన ఫోన్ స్విఛ్ ఆఫ్‌లో ఉందని చెప్పారు. గూగుల్ ఎకౌంట్స్‌ కూడా డిలీట్ చేసిందని… దీంతో ఆందోళన చెంది కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశామని లీసా తల్లి తెలిపారు.

లీసా ఆచూకీ కోసం 11 రోజులు వెతికినప్పటీ ఫలితం లేకపోవటంతో… పోలీసులు మాతా అమృతానందమయి మఠానికి వెల్లి విచారించారు. అయితే… మఠం పెద్దలు లీసా, మహ్మద్ అనే వ్యక్తులు ఎవరూ తమ ఆశ్రమానికి రాలేదని వెల్లడించారు. లీసా వీసా గడువు ఏప్రిల్ 5 నాటికే.. ముగిసింది. అయినప్పటికీ.. ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. దీంతో కేరళ పోలీసులు అన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా ఆమె వివరాలు, పోటో పంపిచారు. లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అక్కడితో ఆగకుండా… ఇంటర్ పోల్‌ సాయం కూడా కోరారు. అయితే, లీసాకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉండే అవకాశం ఉందని ఇంటర్ పోల్ అనుమానం వ్యక్తం చేసింది.

కేరళ పోలీసులు మాత్రం కంటి మీద కునుకు లేకుండా లీసా కోసం గాలిస్తునారు. లీసా, మహ్మద్‌లు విదేశీలు కావటంతో… ఇండియాలోని హోటల్‌లో ఉండాలి అంటే.. అతి ముఖ్యమైన ఫాం సీని నింపాలి. కానీ, ఎక్కడ నింపలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. లీసాతో వచ్చిన మహ్మద్ మార్చి15న యూకే వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. కానీ, లీసా మాత్రం ఇప్పటి వరకు దేశం విడిచి వెళ్లే అవకాశం లేదని అన్నారు. ఏదైనా మత సంస్థలు నడుపుతున్న హాస్టల్‌లో గానీ, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో గానీ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు పలు దేశాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే.. శ్రీలంకలో మారణహోమాన్ని సృష్టించిన జ్ఞాపకాలు ఇంకా కళ్లు ముందు కదులుతున్నాయి. తాజాగా ఆల్‌ఖైదా భారత్‌లో కూడా దాడులకు పాల్పడాలని పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు… ఇంటర్ పోల్ సహాకారం తీసుకుని ఎలాగైనా లీసా ఆచూకీ కనిపెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *