మరో ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

మరో ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకన్నపాలెంకు చెందిన మానస మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మానస.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో తప్పింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో.. 20 రోజులుగా చికిత్స పొందుతోంది. అయితే వైద్యానికి మానస శరీరం సహకరించకపోవడంతో ఇవాళ కన్నుమూసింది. మానస మృతితో వెంకన్నపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *