ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రెండో రోజు కూడా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని అక్కడి నుంచి పంపిస్తున్నారు. వినకపోతే పోలీస్‌ జీపుల్లో బలవంతంగా ఎక్కించుకొని స్టేషన్‌కు తరలిస్తున్నారు.

మరోవైపు ఇంటర్‌ బోర్డు తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా బోర్డు అధికారులు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేసే వరకూ అక్కడి నుంచి కదలబోమంటూ తెగిసి చెప్తున్నారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టులో బాలల హక్కుల సంఘం పిటిషన్.లంచ్ మోషన్‌గా స్వీకరించడానికి గ్రీన్ సిగ్నల్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *