చాయ్ కాలింగ్...టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న కుర్రాళ్లు!

చాయ్ కాలింగ్...టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న కుర్రాళ్లు!

మారుతున్న కాలం పుణ్యమా అని…జీవితంలో బతకడానికి మార్గాలు బోలెడు ఉన్నాయి. కొంచెం ప్రత్యేకంగా ఆలోచించగలిగితే తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడితో అందమైన జీవితాన్ని నిర్మించుకోవచు. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ జాబుల్లో కూడా రానంత ఎన్‌కమ్‌తో సంతోషంగా గడిపేయచ్చు. దీనికి మంచి ఉదాహరణ…బరేలీకి చెందిన అభినవ్ టండన్, ప్రమిత్ శర్మలు. ఇంతకూ వారు చేస్తున్న వ్యాపరం ఏంటో తెలుసా..! టీ కొట్టు. మీరు చదివింది నిజమే…వారిద్దరూ కలిసి పెట్టుకున్న టీ కొట్టు ఐదేళ్లలో రూ. 2 కోట్ల టర్వోవర్‌తో అద్భుతంగా కొనసాగుతోంది. అదెలా సాధ్యమో తెలుసుకుందాం…చదవండి!

రొటీన్ లైఫ్ బోర్ కొట్టి!
ఫుడ్ డెలివరీ లాగే ఇంజనీరింగ్ చదివిన ఈ కుర్రాళ్లు ‘చాయ్ కాలింగ్’ పేరుతో టీని డెలివరీ చేస్తున్నారు. మొదట్లో ఒక బ్రాంచ్‌తో మొదలైనా కొన్నెళ్లకే ప్రధాన నగరాలన్నింటిలో వీరి వ్యాపారాన్ని విస్తరించారు. అభినవ్ టండన్, ప్రమిత్ శర్మ మొదలుపెట్టిన ఈ ‘చాయ్ కాలింగ్’కు వేల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. ప్రతీ ఇల్లు.. ఆఫీసులో వీరికి కస్టమర్లు ఉంటారు. వేరువేరు నగరాల్లో 15 టీ స్టాళ్లను నడుపుతున్న అభినవ్, ప్రమిత్‌లు ఏటా రూ.2 కోట్ల టర్నోవర్‌తో విజయవంతంగా చాయ్ కాలింగ్‌ను నడుపుతున్నారు. బరేలీకి చెందిన అభినవ్, ప్రమిత్‌లు లక్నోలో ఇంజినీరింగ్ పూర్తీ చేశారు. ఇద్దరూ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు. అయితే, రొటీన్‌ లైఫ్‌ బోర్ కొట్టి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నారు. దీంతో 2014లో ‘చాయ్ కాలింగ్’ పేరుతో ఢిల్లీ శాటిలైట్ సిటీ నొయిడా సెక్టార్-16 మెట్రో స్టేషన్ వద్ద టీ-స్టాల్ స్టార్ట్ చేశారు.

ఆ టీ తాగలేక…
చాయ్ కాలింగ్ గురించి అభినవ్ మాట్లాడుతూ.. “ఆఫీసులో ఉన్నప్పుడు మిషన్‌లోని టీ తాగడానికి ఇబ్బందిగా ఉండేది. ఆ టీ తాగలేక బయటకు వెళ్లి తాగేవాళ్లం. అప్పుడే ఈ ఐడియా వచ్చింది. కేవలం రూ.లక్ష పెట్టుబడితో ‘చాయ్ కాలింగ్’ అనే ఒక టీస్టాల్ ప్రారంభించాం. దాని పేరు మీద ఒక వెబ్‌సైట్ కూడా రెడీ చేసుకున్నాం. బిజినెస్ పెరగడంతో చాలా సంస్థల నుంచి మాకు ఆర్డర్లు రావడంతో అప్పటి నుంచి డెలవరీలు మొదలుపెట్టాం. ఒక కప్పు టీ ధర రూ.10 నుంచి రూ.15 మాత్రమే” అని చెప్పాడు. విజయవంతంగా నడుస్తుండటంతో ఇద్దరూ తమ సేవలను ఇళ్లకు కూడా విస్తరించారు. 15 నిమిషాల్లో టీ డెలవరీ చేస్తామంటూ సేవలను విస్తరించారు. నొయిడాలో 3, బరేలీలో 6 స్టాళ్లు ఏర్పాటు చేశారు. దీంతో క్రమేనా సంస్థ టర్నోవర్ పెరగడం మొదలైంది. 2015లో 50 లక్షల టర్నోవర్ ఉండెది కాస్త.. 2019 వచ్చేపాటికి అది రూ.2 కోట్లకు చేరింది. ‘చాయ్ కాలింగ్’ ద్వారా 100 మంది యువతకు ఉపాధి కూడా అందిస్తున్నట్టు చెప్పారు ఈ కుర్రాళ్లు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *