భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజాగా మరో ఘనతను సాధించింది. దక్షిణ అమెరికాలో ఉన్న… ఫ్రెంచ్ గయానాలోని కౌరు ప్రయోగ కేంద్రం నుంచీ బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు ప్రయోగించిన భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 31 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

ఏరియాన్ స్పేస్ సంస్థకు చెందిన ఏరియాన్ 5 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు. జీశాట్ 31 ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవల్ని మరింత సమర్థంగా అందించనుంది. జీశాట్ -31తో పాటు సౌదీకి చెందిన హెల్లాస్ శాట్ -4 ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.