అభినందన్ యాడ్‌పై అద్దిరిపోయే సెటైర్ వీడియో చేసిన ఇండియన్స్

అభినందన్ యాడ్‌పై అద్దిరిపోయే సెటైర్ వీడియో చేసిన ఇండియన్స్

ఐసీసీ ప్రపంచ కప్ ఎప్పుడు జరిగినా ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. విపరీతమైన అంచనాలు పెంచుకుంటారు ప్రేక్షకులు. అయితే…ఇప్పటిదాకా ఏ ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించలేకపోయింది. ఆ అసంతృప్తిని అక్కడి ఓ ఛానల్ వారు జీర్ణించుకోలేక ఈ మధ్యనే పాక్ ఆర్మి నుంచి సురక్షితంగా వచ్చిన అభినందన్ పాత్రను ఉపయోగించి ఒక యాడ్ చేసింది. ఆ యాడ్‌లో అభినందన్ టీ తాగి కప్పును తీసుకెళ్తుంటే…పాక్ అధికారి ‘కప్ ఎక్కడికి తీసుకెళ్తున్నావ్..అది మాది’ అని చెబుతాడు.

ఈ యాడ్ పెద్ద దుమారాన్నే లేపింది. అయితే…భారత అభిమానులు దానికి కౌంటర్‌గా మరొక యాడ్‌ను సృష్టించారు. పాక్ జట్టు వరల్డ్ కప్ కోసం కాదు…టీ కప్పు కోసం పోరాడుతోందని భారత నెటిజన్లు సెటైర్లతో ఆడుకుంటున్నారు. వారి యాడ్‌కు బదులుగా గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించి ఓ యూట్యూబ్ ఛానల్ ‘మౌకా మౌకా’ అనే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో తెగ నచ్చి భారత క్రికెట్ అభిమానులు విజిల్స్ వేస్తూ ఎంకరైజ్ చేస్తున్నారు. ఈ వీడియో ఎంత దుమారం లేపిందంటే…ఒక్కరోజులోనే ఈ వీడియోకు పది లక్షల మందికి పైగా వీక్షించడం.

ఇంతకూ ఆ వీడియో ఎముందో తెలీదు కదా! అయితే చదవండి…భారత క్రికెట్ అభిమాని ఒకరు సెలూన్‌లో ఉండగా.. పాక్ అభిమాని అక్కడికి వచ్చి ‘ఫాదర్స్ డే’ గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్టును తెరిచి చూస్తే అందులో రుమాల్ ఉంటుంది. అదేంటీ రుమాల్ ఇచ్చావని భారత అభిమాని అడుగుతాడు. “ఉంచు, మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ముఖం దాచుకోడానికి పనికి వస్తుంది” అని అంటాడు. అనంతరం సేవింగ్ చేయించుకోడానికి సిద్ధమవుతూ..”ఈ గేమ్ ఏం బాగాలేదు. ఒకే రోజులో కొడుకు తండ్రైపోతాడు’’ అని పంచ్ వేస్తాడు. దీంతో భారత అభిమానికీ, బార్బర్‌కూ కోపం వస్తుంది. భారత అభిమాని బార్బర్‌ వైపు చూసి కంటితో సైగ చేస్తాడు. దీంతో బార్బర్ పాక్ అభిమానికి అభినందన్ లా కనబడేట్టు గెడ్డం, మీసాలను కట్ చేస్తాడు. అది చూసి పాక్ అభిమాని బాధపడతాడు. “ఇది అభినందన్ స్టైల్. అతను మా హీరో” అని భారత అభిమాని సమాధానం చెబుతాడు. “అతడు మాకు హీరో కాదు. బయట నా స్నేహితులు ఉన్నారు. నా ముఖం వారికి ఎలా చూపించుకోవాలి” అని పాక్ అభిమాని ఏడుపు ముఖం పెట్టుకుని చెబుతాడు. దీంతో భారత అభిమాని అతనికి రుమాలు తిరిగిచ్చి “దీనితో నీ ముఖాన్ని దాచుకో” అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. దీంతో ‘ఫాదర్స్ డే’ రిటర్న్ గిఫ్ట్ అదుర్స్ అంటూ భారత నెటిజన్స్ ఈ వీడియోను షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *