రన్ మెషిన్ విరాట్...!

రన్ మెషిన్ విరాట్...!

ప్రస్తుతం ఉన్న బ్యాట్స్‌మెన్ లో విరాట్ తిరుగులేని శక్తి. తనని ఎదుర్కొనే బౌలర్ ఎవరూ లేరనే స్థాయికి ఎదిగిన రికార్డుల రారాజు. క్రీజులో విరాట్ ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయేలా చేస్తున్నాడు. తక్కువ వయసులోనే అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతున్న అద్భుతమైన ఆటగాడు. చాలా తొందరగా బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఈరోజు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రముఖులు, క్రికెట్ అభిమానులు కొహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రముఖుల శుభాకాంక్షలు…

కెప్టెన్‌గానే కాకుండా బ్యాటింగ్‌లో కూడా స్పీడ్‌గా దూసుకుపోతున్నాడు విరాట్…ఎన్నో రికార్డులను బద్దలు చేస్తూ సచిన్‌ని దాటి చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇంకా మరిన్ని అద్భుతాలు సాధించాలని కోరుకుంటూ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేష్ రైనా, వృద్ధిమాన్ సాహా ఇంకా కొందరు కొహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. 

విరాట్ 30 వ పుట్టినరోజు సందర్భంగా భార్య అనుష్క శర్మ వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసింది. 

ఇండియన్ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కూడా విరాట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ధోనీ, జడేజా మిగతా కొందరు క్రికెటర్లు కొహ్లీకి శుభాకాంక్షలు చెబుతున్న స్పెషల్ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అభిమానులు కూడా కొహ్లీ పుట్టినరోజుని ఘనంగా చేసుకుంటున్నారు. 

పోస్ట్‌లు…!

ఈ ధనత్రయోదశి(ధంతేరాస్‌) రోజున…ఈ ఏడాది కూడా రన్‌తేరాస్‌(పరుగులు)తో నిండిపోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే విరాట్‌ – అని వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 

టీమిండియా కెప్టెన్‌, రన్ మెషిన్ విరాట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు – అని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. 

చేతిలో మ్యాజిక్‌ స్టిక్‌తో ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా తీసుకువస్తున్నాడు. స్థిరంగా బ్యాటింగ్ చేయడానికి విరాట్ ఒక ఉదాహరణ. పరుగుల ఆకలికి నిర్వచనంగా మారిపోయాడు. హ్యాపీ బర్త్‌డే కొహ్లీ -అని మహ్మద్‌ కైఫ్‌ పోస్ట్ చేశాడు. 

ఇటీవలే సచిన్‌ రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు. అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ ఈ రికార్డును సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కి కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. 

 
 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *