సిడ్నీ మైదానంలో పంత్ పాటతో హోరెత్తించారు...

సిడ్నీ మైదానంలో పంత్ పాటతో హోరెత్తించారు...

స్లెడ్జింగ్‌కు కేర్ ఆఫ్‌గా మారిన ఆస్ట్రేలియా ఆటగాళ్లను సైతం తనదైన శైలిలో స్లెడ్జింగ్‌తోనే జవాబు చెప్పాడు రిషబ్ పంత్. భారత జట్టుకు దొరికిన అరుదైన ఈ యువ వికెట్ కీపర్ చివరి టెస్ట్‌లో తన బ్యాట్ పవర్‌ని కూడా చూపించాడు. గత టెస్టుల్లో ఆసీస్ ఆటగాళ్లకు మాటలతోనే జవాబు చెప్పిన పంత్…సిడ్నీ టెస్టులో శతకం చేసి… మాటల్తోనే కాదు బ్యాట్‌తోనూ సమాధానం చెప్పగలనని నిరూపించాడు. పైగా ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా కూడా రికార్డుల్లో చేరాడు. 189 బంతుల్లో 159 పరుగులు చేసిన రిషబ్ పంత్…సిరీస్ మొత్తం తన ప్రవర్తనతో అభిమానులను సంపాదించాడు. తాజా సెంచరీతో మరింత మంది అభిమానుల మనసులను దోచుకున్నాడు. 

Rishabh Pant Song

అద్భుతమైన పాట…

తన అద్భుత ప్రదర్శన చూడ్డానికి సిడ్నీ మైదానానికి వచ్చిన కొందరు భారత అభిమానులు పంత్‌పై అద్భుతమైన పాటను కూడా కట్టారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. పంత్-పైన్ స్లెడ్జింగ్ అంశం ప్రతిబింబించేలా ఈ పాట లిరిక్స్‌ని రాశారు…” we’ve hot pant. Rishab pant. I just don’t think you’ll understand. He’ll hit you for a six. He’ll babysit your kids. We’ve got Rishab Pant” ఈ మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

ఇక సిడ్నీ మైదానంలో చివరి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్స్ రాణించడంతో భారత జట్టు భారీ స్కోరుని చేసింది. చటేశ్వర్ పుజార(193), రిష్బ్ పంత్(159) సెంచరీలతో పాటు…జడేజా(81), మయాంక్ అగర్వాల్(77) అర్ధసెంచరీలతో చేయడంతో 622 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మూడో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి ఆసీస్ జట్టు ఒక వికెట్ నష్టపోయి 122 పరుగులు చేసింది. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *