శిఖర్ ధావన్ లవ్ స్టోరీ

శిఖర్ ధావన్ లవ్ స్టోరీ

శిఖర్ ధావన్ క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతీరుతో టీం ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు ధావన్.ఈమధ్య జరుగుతున్న ఆసియా కప్ లో కూడా దుమ్మురేపుతున్నాడు ఈ క్రికెటర్ .  అయితే ధావన్‌ బౌండరీలు, సిక్సర్లు బాదేస్తుంటే స్టాండ్స్‌లో నిలబడి చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తూ ఉంటుంది అతడి సతీమణి ఆయేషా. వీరిద్దరిదీ అన్యోనమైన జంట.

అసలు వీరి పరిచయం ఎలా అయ్యింది..అది ప్రేమగా ఎలా మారింది..పెళ్లి ఎలా జరిగింది..ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం పదండి.

shikhar dhawan

పదేళ్లు పెద్దది…

ధావన్ భార్య పూర్తి పేరు అయేషా ముఖర్జీ .బ్రిటీష్ సంతతికి చెందిన అమ్మాయి. పెద్ద  బాక్సింగ్‌ క్రీడాకారిణి. మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి.  పైగా ధవన్ కంటే అయే షా పదేళ్లు పెద్దది. అయినా కూడా ధావన్ ఇవేమీ పట్టించుకోకుండా ఆమెను పెళ్లాడాడు. మొదట అయేషా హర్భజన్ స్నేహితురాలు. హర్భజన్ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న అయేషాకు ధావన్ ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు.ఆ రిక్వెస్ట్ ను మొదట అయేషా సమ్మతించలేదు. ధావన్ ఎలాంటివాడో అయేషాకు ఉన్న క్రికెట్ మిత్రులు చెప్పడంతో ధావన్ రిక్వెస్ట్ ను ఓకే చేసింది . యాక్సెప్ట్‌ చేసిన ఐదు నిమిషాల్లోనే ధావన్ ఆమెతో ఛాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడట.  ఓ సారి అలా మూడు గంటలు ఛాటింగ్‌ చేస్తూ ధావన్ తాను ఎక్కాల్సిన  విమానం కూడా మర్చిపోయాడట.  ఈ విషయాలన్నీ స్వయంగా వెల్లడించింది అయేషా.

shikhar dhawan

ఫేస్‌బుక్ ప్రేమ…

అలా ఫేస్‌బుక్ ద్వారా చిగురులు తొడిగిన వారి ప్రేమ.. 2009లో వివాహనిశ్చితార్థం.. 2012లో పెళ్లి పీటలు ఎక్కే వరకు సాగింది. టీవీలో శిఖర్ ధావన్ బ్యాటింగ్ చూస్తూ  వీరి కుమారుడు జొరావర్‌ సింగ్‌కు జన్మనిచ్చింది అయేషా. జోరా పుట్టిన నాలుగు రోజులకు ధావన్‌ అతడిని చూశాడట. వెంటనే భావోద్వేగానికి గురయ్యాడట.తామిద్దరం  సరదాగా విహారాలకు వెళ్తున్నామని అందరూ అనుకుంటారని కానీ అది తప్పని అయేషా చెప్పింది. ఒక్కోసారి తాము కలిసి భోజనం చేయడానికే ఆరునెలలు పడుతుందని ఆమె బాధతో చెప్పింది.  బయటవారికి ఒకవైపే తెలుసని ఆమె చెప్పింది.

shikhar dhawan ayesha mukherjee

ధావన్ సక్సెస్ వెనుక…

ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఓ స్త్రీ ఉంటుందో , లేదో తెలియదు గాని ధావన్ సక్సెస్ వెనుక మాత్రం  భార్య ఆయేషా ముఖర్జీ ఉంది. ఫామ్ సరిగ్గా లేక బాధపడుతున్నప్పుడు ధావన్ ను ఓదార్చుతుంది అయేషా. అసలు  ఆమెను పెళ్లాడాకే ధావన్ సుడి తిరిగింది. అయేషాతో పెళ్లైన తర్వాతనే టీంఇండియాలో ధావన్ స్థానం సుస్థిరమయ్యింది. ప్రేమకు వయసు, కులం, జాతి, మతం ఇలాంటివేమీ ఉండవని మనకు ఈ జంటను చూస్తే ఇట్టే అర్థ మైపోతుంది. శిఖర్..అయేషా ఇద్దరూ కలకాలం ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలని మనసారా ఆశీర్వదిద్దాం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *