క్రికెట్‌కు అంబటి గుడ్‌బై

క్రికెట్‌కు అంబటి గుడ్‌బై

అంబటి రాయుడు క్రికెట్‌కు బాయ్ చెప్పాడు. ఆగ్రహంతో క్రికెట్ నుంచి వైదొలిగాడు. రాయుడికి బదులు వరల్డ్ కప్‌లో స్థానం సంపాదించుకున్న విజయ్ శంకర్‌ గాయం కారణంగా వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి తీసుకున్నారు. మయాంక్ అగర్వాల్‌ ను తీసుకోవడంతో రెండో సారీ కూడా అవకాశం రాలేదన్న నిరాశతో ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో స్టాండ్‌ బైలో ఉన్నప్పటికీ రాయుడికి అవకాశం రాకపోవడం గమనార్హం.

క్రికెట్‌ కెరీర్‌లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1,694 పరుగులు చేశాడు. ఆరు అంతర్జాతీయ టీ20లు ఆడి 42 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌ల్లో 3,300 పరుగులు రాయుడు చేశాడు. చివరిగా ఐపీఎల్‌ -2019లో చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున 17 మ్యాచులు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 97 మ్యాచుల్లో 156 ఇన్నింగ్స్‌లో 6,151 పరుగులు రాబట్టాడు. ఈ ఫార్మాట్‌లో రాయుడు వ్యక్తిగత అత్యధిక స్కోరు 210 పరుగులు. లిస్ట్‌-ఏలో 160 మ్యాచులాడి 5,103 పరుగులు చేశాడు. ఇక 216 టీ20లు ఆడి 4,584 పరుగులు చేశాడు. 2013 జులై 24న టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేసిన రాయుడు.. చివరగా ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆడాడు. 2014లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన టీ20నే అతడికి ఆఖరిది. ఈ ఏడాది మార్చిలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున చివరిసారిగా ఆడాడు.

సో…..ఒక తెలుగు ఆటగాడి కెరీర్ ముగిసింది. ఆగ్రహంతోనో, ఆవేదనతోనే రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. సో…అంబటిరాయుడి భవిష్యత్తు బాగుండాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *